ఒలంపిక్ విజేతలకు థార్ ఎస్‌యువిలను అందజేసిన మహీంద్రా
భారత దేశపు ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ మహీంద్రా గౌరవ అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా ఒలంపిక్ విజేతలకు థార్ ఎస్‌యువిలను బహుకరిస్తానని ప్రకటించిన విషయం విధితమే. తన మాటను నిలబెట్టుకుంటూ పి.వి సింధు మరియు సాక్షి మాలిక్‌లకు థార్ ఎస్‌యువిలను అందజేసారు.

2016 రియో ఒలంపిక్స్ రజతం సాధించిన పి.వి.సింధుకు మరియు కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌లకు కస్టమైజ్డ్ థార్ ఎస్‌యువి వాహనాలను అందింస్తానని ఆనంద్ మహీంద్రా తన ట్వట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన విషయం విధితమే.

రెండు కస్టమైజ్డ్ థార్ ఎస్‌యువిలను ఒలంపిక్ విజేతలకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అందజేసారు.

పి.వి. సింధు ఒలంపిక్స్‌లో భారత దేశానికి మొదటి రజత పతకాన్ని సాధించింది మరియు ఒలంపిక్స్‌లో రెజ్లింగ్ ద్వారా పతకాన్ని సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టిచారు.

పి.వి. సింధు రజత (సిల్వర్) పతకాన్ని సాధించినందుకు గాను సిల్వర్ పెయింట్‌లో థార్ ను డిజైన్ చేసి మరియు ఇతర కస్టమైజేషన్ చేయించి ఆమెకు బహూకరించారు.

ఇక సాక్షి మాలిక్‌కు ఎరుపు రంగులో ఉన్న థార్ ఎస్‌యువిని అందజేశారు. అయితే కాంస్య పతకానికి చిహ్నంగా ముందు వైపున ఉన్న గ్రిల్‌ను కాంస్యం (బ్రాంజ్) రంగుల్లో డిజైన్ చేశారు.

వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్నందు వలన చాలా వరకు సంస్థలు వినియోగదారులను భారీ మోసం చేస్తున్నారు. అయితే దళారుల ద్వారా మోసపోకుండా మీ అంతట మీరే స్వతహాగా ఇన్సూరేన్స్ చేసుకునే అధునాతన విధానం మీకోసం...


Click it and Unblock the Notifications








