173 శాతం వృద్దితో దూసుకెళ్తోన్న రెనో క్విడ్ :ఇదే పరిస్థితి కొనసాగితే, ఆల్టో కథ కంచికే...!!
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోని ఎంట్రీలెవల్ సెగ్మెంట్లోకి తమ క్విడ్‌ను విడుదల చేసి అమ్మకాల పరంగా తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టించింది. భారత దేశపు సరికొత్త ఎంట్రీలెవల్, అత్యంత సరసమైన కారు గడిచిన జూన్ 2016లో ఏకంగా 173 శాతం దేశీయ అమ్మకాల వృద్దిని సాధించింది.

గడిచిన జూన్ 2015 లో రెనో మొత్తం మీద 4,340 యూనిట్ల అమ్మకాలు జరపగా అదే జూన్ 2016లో 11,837 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో అధిక శాతం అమ్మకాలు క్విడ్‌కు చెందినవే.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెనో ఇండియాకు 210 ఆధీకృత డీలర్ షిప్‌లు ఉన్నాయి. ఫ్రెంచ్ ఆధారిత సంస్థ రెనో ఇండియాలో బలమైన ఆటోమొబైల్ తయారీదారుడిగా ఎదిగేందుకు డీలర్ల సంఖ్యను 210 నుండి 270 కి 2016 చివరినాటికి పెంచాలని చూస్తోంది. అమ్మకాల పరంగా ఊహించని అనుభవం పొందిన రెనో దేశీయ వినియోగదారులకు కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించనుంది.
Also Read: ప్రతి భారతీయుని స్థోమతకు సరితూగే ఐదు డీజల్ కార్లు
జనవరి-జూన్ 2015 కాలంలో రెనో 23,346 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఆ తరువాత జనవరి-జూన్ 2016 లో 165 శాతం వృద్దితో 61,895 యూనిట్ల అమ్మకాలను జరిపింది. ఇందులో కూడా క్విడ్ ప్రభావమే ఉంది.
Also Read: రెనో క్విడ్ కారు పుట్టుక వెనకున్న........ఆసక్తికరమైన సమాచారం !
రెనో క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి క్రింది కథనంలో...

రెనో క్విడ్ ప్రయోజనాలు:
ప్లాస్టిక్ వాడకం :
ఒకరకంగా చూస్తే ఇందులో దాదాపుగా ఎక్కువ ప్లాస్టిక్ వాడినట్లు తెలుస్తోంది. దీని సైడ్ అద్దాలు మరియు కారు తలుపులు లోపలి వైపున కూడా ఎక్కువగా ప్లాస్టిక్ వాడినట్లు అనిపిస్తోంది దీని వలన కారు బరువు చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు.

టాకోమీటర్ లేకపోవడం :
టాకో మీటర్ అనగా ఇంజన్ యొక్క ఆర్.పి.యమ్ ని చూపుతుంది. పాత కాలంలో దీనిని పెద్దగా పట్టించుకునే వారుకాదు అయితే ప్రస్తుతం కాలంలో యువత అందరూ దీనిని కోరుకుంటున్నారు. దీని వలన డ్రైవింగ్ మీద మంచి ఇష్టం కలుగుతుంది మరియు డ్రైవ్ చేస్తున్న సమయంలో మంచి అనుభూతి లోనవుతారు. ( అర్.పి.యమ్ అనగా రౌండ్స్ పర్ మినిన్ అంటే ఒక నిమిషంలో ఇంజిన్‌లో గల ఫ్లైవీల్ ఎన్ని చుట్లు తిరిగిందని అర్థం ).

శబ్దం మరియు కుదుపులు :
శబ్దం రాని కారు కావాలనుకుంటే కొంచెం ఎక్కు డబ్బు వెచ్చించాల్సి వస్తుంది మరియు కుదుపులు అంటారా కారును తక్కువ గేర్లలో నడుపుతున్నప్పుడు కుదుపులు ఉంటాయి తరువాత నిర్ణీత వేగాన్ని అందుకున్న తరువాత ఎలాంటి కుదుపులు ఉండవు.

స్టీరింగ్ వీల్ అడ్జెస్ట్‌మెంట్ :
రెనొ క్విడ్ లో ఉన్న ముఖ్యమైన లోపం స్టీరింగ్ వీల్‌ను అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు లేకపోవడం. కనీసం క్విడ్ యొక్క టాప్ ఎండ్ లెవల్‌లో కూడా ఈ అవకాశం లేదు. మరి పొట్టిగా ఉన్న వ్యక్తులకు ఇది సరిపోకపోవచ్చు.

క్విడ్ యొక్క ప్రయోజనాలు :
డిజైన్ :
క్విడ్‌కి గల ఏకైక పెద్ద అడ్వాంటేజ్ డిజైన్. ఎంట్రిలెవల్ హ్యాచ్ బ్యాక్ లో అత్బుతమైన డిజైన్ గల కారు ఏదంటే రెనొ క్విడ్ ఇప్పటి వరకు ఉన్న అన్నికార్లను ఒక్క సారిగా పక్కకు నెట్టేసిందని చెప్పివచ్చు. దీనికి ముందువైపు గల బోల్డ్ స్టేన్స్ ఎక్కువ ఆకర్షణగా నిలించిందని చెప్పవచ్చు దీనిని రెనొ డస్టర్ ప్రేరణతో డిజైన్ చేశారని సమాచారం ఏదయితేనేం క్విడ్ యొక్క డిజైన్ ఎంతో మంది భారతీయుల మనస్సును దోచేసుకుంది. ఒక సారి మీరు దీనిని చూశారంటే తప్పకుండా ప్రేమిస్తారు.

ఇంటీరియర్ :
కారు చిన్నదని అనుకుంటున్నారా దీని ఇంటీరియర్ చూశారంటే మీరు ఒక గదిలో అనుభూతిని పొందుతారు, దీని క్యాబిలో గల లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వెనుకవైపు సీటులో ముగ్గురు పెద్దలు కూర్చోవచ్చు అతి తక్కువ బడ్జెలో ఎక్కువ సీటింగ్ కెపాసిటి గల కారు ఇదే మరి. దీని ముందు సీట్లు మనకు సౌకర్యవంతంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అయితే వెనుకవైపున గల సీట్లో ముగ్గురితో దూరప్రాంత ప్రయాణాలు అంతసౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.

ఇంజిన్ :
అందరు ముఖ్యంగా చూసేది ఇంజన్ గురించి. దీనిలో గల 3-సిలిండర్ల ఇంజన్ 53 బి.హెచ్.పి ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటర్ కి 25.17 కిలోమీటర్లు దీనికి ప్రత్యక్ష పోటిగా ఉన్న మారుతి ఆల్టో కన్నా ఇది ఎక్కువ.

కెపాసిటి :
రెనొ క్విడ్ కేవలం 669 కిలోలు మాత్రమే మోయగలదు అంటే మారుతి కన్నా ఇది తక్కువే. మరియు బరువు పరంగా రెనొ క్విడ్, మారుతి కన్నా 26 కేజిలు తక్కువగా ఉంటుంది.

గ్రౌండ్ క్లియరెన్స్ :
రెనొ క్విడ్ అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది దాదాపుగా 180 ఎమ్ఎమ్ అంటే మహీంద్ర బొలెరికి ఉన్నంత. కాబట్టి చిన్న గుంతలు గల రోడ్లమీద వెళుతున్నప్పుడు కారు యొక్క క్రింద భాగం నేలకు తగులుతుందనే భయం లేకుండా మీరు కారును డ్రైవ్ చేయవచ్చు.

మల్టిమీడియా :
మనం చెల్లించే అతి తక్కువ ధరకు ఇందులో మంచి మల్టీమీడియాను కూడా అందించారు.
- కీ లేస్ ఎంట్రీ
- నావిగేషన్ గల తాకే తెర
- పూర్తిగా డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కంన్సోల్
- పవర్ విండోస్

ఆడియో సిస్టమ్ :
మీరు చదివింది నిజమే ఇందులో 2-డి.ఐ.యన్ ఆడియో సిస్టమ్ మరియు అన్ బోర్డ్ ట్రిప్ కంప్యూటర్ ఉన్నాయి

బూట్ స్పేస్ :
ఎవరయితే లాంగ్ డ్రైవ్ వెళ్లాలని అనుకుంటారో వారి కోసమే ఈ ప్రయోజనము ఎందుకంటారా దూరప్రాంత ప్రయాణాలలో ఎక్కువ లగేజ్ ను తిసుకెళ్లడానికి కుదరదు కాని రెనొ క్విడ్ మీకు ఇస్తుంది 300-లీటర్ల లగేజే స్పేస్ మరియు అవసరాన్ని బట్టి దీనిని 1115-లీటర్ల వరకు పెంచుకోవచ్చు. మారుతి ఆల్టోతో పోల్చుకుంటే ఇది ఎంతో ఎక్కువ అందులే కేవలం 177-లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ఉంది.

భద్రత :
ఎంట్రి లెవల్ హ్యాచ్ బ్యాక్ లలో భద్రతకు రెనొ క్విడ్ పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు. కారు చిన్నదైనా భద్రతో కూడిన మంచి సౌకర్యాలు ఇందులో చూడవచ్చు రెనొ క్విడ్‌లో గల టాప్ లెవల్ మోడల్ ఆర్.ఎక్స్.ఇ లో డ్రైవర్ పక్కవైపున ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ అందిచారు. అయితే ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు.

రెనొ క్విడ్ యొక్క రేటింగ్స్ :


Click it and Unblock the Notifications








