2017 క్లియో హ్యాచ్‌బ్యాక్‌ను 2016 ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శించనున్న రెనో
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనో తమ క్లియో హ్యాచ్‌బ్యాక్ కారును అప్‌డేట్ చేసి 2017 క్లియో గా అందుబాటులోకి తీసుకురానుంది. 2016 ప్యారిస్ మోటార్ షో కోసం రెనో ఈ క్లియో కు మార్పులు చేర్పులు చేసి 2017 క్లియో గా ప్రదర్శించనుంది. ముఖ్యంగా యువ కొనుగోలుదారులను ఉద్దేశించి దీనిని రూపొందించారు. 2017 రెనో క్లియో గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

2017 రెనో క్లియో హ్యాచ్‌బ్యాక్ కారు డీజల్ మరియు పెట్రోల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభించనుంది.

రెనో ఈ 2017 క్లియోలో ఉన్న రెండు రకాల ఇంజన్ ఆప్షన్లకు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దీనిని కోరుకునే డిమాండ్‌ను బట్టి కొన్ని దేశాల మార్కెట్‌లలో దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా అందించనున్నారు.

2017 రెనో క్లియో హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త గా సరికొత్త సిగ్నేచర్ ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లను అందించారు.

రెనో సంస్థ ఈ 2017 క్లియో కారును నాలుగు విభిన్న రంగుల్లో అందిస్తోంది. అవి,
- మార్స్ రెడ్,
- ఆర్కిటిక్ వైట్,
- ఐరన్ బ్లూ,
- టైటానియమ్ గ్రే

రెనో ఇంజనీర్లు దీని ఇంటరీయర్ డిజైన్ కోసం ప్రత్యేక శ్రద్ద చూపారు. నూతన శైలిని కల్పించేందుకు అధునాతన అప్‌హోల్ట్ర్సేను అందించారు.

2017 రెనో క్లియో ఇంటీరియర్‌లో మూడు మల్టీమీడియా ఆప్షన్‌లు కలవు.

ఇందులో రెనో ఆర్-లింక్ ఎవల్యూషన్, స్మార్ట్ ఆర్&గో మరియు మీడియా నవ్ ఎవల్యూషన్‌లు ఉన్నాయి.

భారీ డిస్కౌంట్లతో ఐదు సెడాన్ కార్లు
గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు


Click it and Unblock the Notifications








