హాటు కేకుల్లా క్విడ్ కార్లు: ఒక్క రోజులోనే 200 కార్లు డెలివరీ
దేశం మొత్తం రెనో వారి క్విడ్ నామం మారుమ్రోగిపోతోంది. గత ఏడాదికి ముందు సామాన్యులకు కారు కొనాలనే కోరిక మారుతి ఆల్టో తో తీరేది. కాని అత్యత్తమ డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చిన రెనో భారతీయుల యొక్క ఫేవరేట్‌గా మారిపోయింది. బజార్లో హాటు కేకులు అమ్ముడుపోయే రీతిలో క్విడ్ కార్ల అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి.
గత వారంలో కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న రెనో ఆధీకృత డీలర్ వారి ఆధ్వర్యంలో ఒకే రోజున 200 క్విడ్ కార్లను డెలివరీ జరిగాయి. దీనికున్న క్రేజ్ ఇంతకన్న మరే రీతిలో చెప్పలేరు. విశేష ఆధారణ పొందుతున్న క్విడ్ ద్వారా ఒకే రోజున 200 కార్లను డెలివరీ చేసిన ఘనత రెనోకే దక్కింది.

క్విడ్ యొక్క ప్రయోజనాలు :
డిజైన్ :
క్విడ్‌కి గల ఏకైక పెద్ద అడ్వాంటేజ్ డిజైన్. ఎంట్రిలెవల్ హ్యాచ్ బ్యాక్ లో అత్బుతమైన డిజైన్ గల కారు ఏదంటే రెనొ క్విడ్ ఇప్పటి వరకు ఉన్న అన్నికార్లను ఒక్క సారిగా పక్కకు నెట్టేసిందని చెప్పివచ్చు. దీనికి ముందువైపు గల బోల్డ్ స్టేన్స్ ఎక్కువ ఆకర్షణగా నిలించిందని చెప్పవచ్చు దీనిని రెనొ డస్టర్ ప్రేరణతో డిజైన్ చేశారని సమాచారం ఏదయితేనేం క్విడ్ యొక్క డిజైన్ ఎంతో మంది భారతీయుల మనస్సును దోచేసుకుంది. ఒక సారి మీరు దీనిని చూశారంటే తప్పకుండా ప్రేమిస్తారు.

ఇంటీరియర్ :
కారు చిన్నదని అనుకుంటున్నారా దీని ఇంటీరియర్ చూశారంటే మీరు ఒక గదిలో అనుభూతిని పొందుతారు, దీని క్యాబిలో గల లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వెనుకవైపు సీటులో ముగ్గురు పెద్దలు కూర్చోవచ్చు అతి తక్కువ బడ్జెలో ఎక్కువ సీటింగ్ కెపాసిటి గల కారు ఇదే మరి. దీని ముందు సీట్లు మనకు సౌకర్యవంతంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అయితే వెనుకవైపున గల సీట్లో ముగ్గురితో దూరప్రాంత ప్రయాణాలు అంతసౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.

ఇంజన్ :
అందరు ముఖ్యంగా చూసేది ఇంజన్ గురించి. ఇందులో ఉన్న 3-సిలిండర్ల 800సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ 53 బి.హెచ్.పి ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటర్ కి 25.17 కిలోమీటర్లు దీనికి ప్రత్యక్ష పోటిగా ఉన్న మారుతి ఆల్టో కన్నా ఇది ఎక్కువ.

కెపాసిటి :
రెనొ క్విడ్ కేవలం 669 కిలోలు మాత్రమే మోయగలదు అంటే మారుతి కన్నా ఇది తక్కువే. మరియు బరువు పరంగా రెనొ క్విడ్, మారుతి కన్నా 26 కేజిలు తక్కువగా ఉంటుంది.

గ్రౌండ్ క్లియరెన్స్ :
రెనొ క్విడ్ అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది దాదాపుగా 180 ఎమ్ఎమ్ అంటే మహీంద్ర బొలెరికి ఉన్నంత. కాబట్టి చిన్న గుంతలు గల రోడ్లమీద వెళుతున్నప్పుడు కారు యొక్క క్రింద భాగం నేలకు తగులుతుందనే భయం లేకుండా మీరు కారును డ్రైవ్ చేయవచ్చు.

మల్టిమీడియా :
మనం చెల్లించే అతి తక్కువ ధరకు ఇందులో మంచి మల్టీమీడియాను కూడా అందించారు.
- కీ లేస్ ఎంట్రీ
- నావిగేషన్ గల తాకే తెర
- పూర్తిగా డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కంన్సోల్
- పవర్ విండోస్
- రెనో నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా...

ఆడియో సిస్టమ్ :
మీరు చదివింది నిజమే ఇందులో 2-డి.ఐ.యన్ ఆడియో సిస్టమ్ మరియు అన్ బోర్డ్ ట్రిప్ కంప్యూటర్ ఉన్నాయి

వారంటి :
వీటితో పాటు మీకు మంచి వారంటి కూడా ఇస్తున్నారు. 2 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు మరియు దీనిని 3 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు, 4 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లుకు పొడిగించారు.

బూట్ స్పేస్ :
ఎవరయితే లాంగ్ డ్రైవ్ వెళ్లాలని అనుకుంటారో వారి కోసమే ఈ ప్రయోజనము ఎందుకంటారా దూరప్రాంత ప్రయాణాలలో ఎక్కువ లగేజ్ ను తిసుకెళ్లడానికి కుదరదు కాని రెనొ క్విడ్ మీకు ఇస్తుంది 300-లీటర్ల లగేజే స్పేస్ మరియు అవసరాన్ని బట్టి దీనిని 1115-లీటర్ల వరకు పెంచుకోవచ్చు. మారుతి ఆల్టోతో పోల్చుకుంటే ఇది ఎంతో ఎక్కువ అందులో కేవలం 177-లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ఉంది.

భద్రత :
ఎంట్రి లెవల్ హ్యాచ్ బ్యాక్ లలో భద్రతకు రెనొ క్విడ్ పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు. కారు చిన్నదైనా భద్రతో కూడిన మంచి సౌకర్యాలు ఇందులో చూడవచ్చు రెనొ క్విడ్‌లో గల టాప్ లెవల్ మోడల్ ఆర్.ఎక్స్.ఇ లో డ్రైవర్ పక్కవైపున ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ అందిచారు. అయితే ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు.

తీర్పు :
గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఎంట్రి లెవల్ హ్యాచ్ బ్యాక్ గా కొనసాగుతూ వచ్చిన మారుతి ఆల్టో 800 తో రెనొ క్విడ్‌ని పోల్చగా ఇందులో ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి అతి తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి రెనొ క్విడ్ ఎంతో ఉత్తమంగా ఉంటుందనేది మా నిర్ణయం మరి మీ నిర్ణయం ?



Click it and Unblock the Notifications








