కొలియోస్ మరియు ఫ్లూయెన్స్ లను మార్కెట్ నుండి తొలగిస్తున్న రెనో ఇండియా

రెనో ఇండియా లైనప్‌లో ఉన్న కొలియోస్ మరియు ఫ్లూయెన్స్ వాహనాలను తొలగించాలనే ఆలోచనలో ఉంది. వీటిని మార్కెట్ నుండి తొలగించి ప్రాంతీయంగా ఉన్న ఉత్పత్తుల అభివృద్ది మీద దృష్టి సారించనుంది.

By Anil

ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో దేశీయంగా తమ లైనప్‌లో ఉన్న కొలియోస్ మరియు ప్ల్యూయెన్స్ మోడళ్లను తొలగించే ఆలోచనలో ఉంది. వీటిని పూర్తిగా మార్కెట్ నుండి తొలగించి, వీటికి బదులుగా దేశీయంగా నూతన ఉత్పత్తుల అభివృద్ది మీద దృష్టిసారించనుంది.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

రెనో ఇండియా తమ లైనప్‌లోకి కార్లను దిగుమతి చేసుకోవడానికి బదులుగా ఇండియన్ మార్కెట్ అవసరాలకు సరిపోయే ఎస్‌యువి,హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్‌లను 80 శాతం వరకుదేశీయంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

ప్రస్తుతం రెనో ఇండియా శ్రేణిలో ఉన్న కొలియోస్ మరియు ఫ్లూయెన్స్ వాహనాలు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరపలేదు. వీటికి సరైన ధరను నిర్ణయించడంలో కూడా రెనో విఫలమైందని చెప్పవచ్చు.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

రెనో ఇండియా ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం ఎస్‌కెడి రూపంలో దేశీయ విపణిలోకి దిగుమతి చేసుకుంటోంది.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

రెనో ఇండియా చీఫ్ ఎక్జ్సిక్యూటివ్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, దేశీయంగా అత్యంత ప్రీమియమ్ సెడాన్ మరియు ఎస్‌యువి సెగ్మెంట్లో కొలియోస్ మరియు ప్లూయెన్స్ ఉత్పత్తులు వ్యూహాత్మక వారధిగా ఉన్నాయి.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

రెనో సంస్థకు భారీ విజయాన్ని సాధించిపెట్టిన క్విడ్ ను దాదాపు దేశీయంగా అభివృద్ది చేశారు. జూలై 2016 నుండి ప్రతి నెలా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల విభాగంలో స్థానం సంపాదించింది. ఈ కారణం చేత చిన్న కార్ల అభివృద్ది మరియు ఉత్పత్తి మీద రెనో ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

జనవరి నుండి ఆగష్టు 2016 వరకుప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాల పరంగా రెనో గ్లోబల్ నందు రెనో ఇండియా ఏడవ స్థానంలో నిలిచింది. దీనికి ముఖ్య కారణం రెనో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

రెనో వచ్చే ఏడాది నుండి ఐదేళ్ల వరకు ప్రతి సంవత్సరం కూడా దేశీయ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. మారుతి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లకు ప్రత్యక్ష పోటీగా సరికొత్త కాంపాక్ట్‌ ఎస్‌యువిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు:

ఇక మీదట క్విడ్ లైనప్‌లోకి ప్రతి ఏడాది ఒక కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు రెనో ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నూతన వేరియంట్లు వివరాలు...

కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

ఇండియాలో విడుదల కానున్న రెనో కార్ల జాబితా....

రెనో సంస్థ డస్టర్‌తో మొదలు పెట్టిన విజయపు ప్రస్థానం క్విడ్ విజయంతో కొనసాగిస్తోంది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని రెనో సంస్థ ఇండియన్ వినియోగదారులకు మరిన్ని కొత్త ఉత్పత్తులను అందివ్వడానికి సిద్దమైంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2016, 18:24 [IST]
English summary
Renault Plans To Discontinue Koleos And Fluence In India; To Focus On Locally Produced Vehicles
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+