అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌ను విడుదల చేసిన రెనో
రెనో ఇండియా భారత దేశపు 2016 పండుగ వేడుకల సందర్భంగా తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి డస్టర్‌ను అడ్వెంచర్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఫ్రెంచ్‌కు చెందిన రెనో దేశీయంగా తమ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు పండుగ సీజన్ సందర్భంగా స్పెషల్ ఎడిషన్‌ను విడుదల అందుబాటులోకి తెచ్చింది.

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ధర వివరాలు
- డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 85పిఎస్ ఆర్ఎక్స్ఇ ధర రూ. 9.65 లక్షలు
- డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 85పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ధర రూ. 10.45 లక్షలు
- డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 110పిఎస్ ఆర్ఎక్స్‌జడ్ ధర రూ. 13.78 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లతో పాటుగా ఈ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్ అందుబాటులో ఉంది.

సాంకేతికంగా ఈ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్ ఎస్‌యువిలో 1.5-లీటర్ సామర్థ్యం గల డిసిఐ డీజల్ ఇంజన్ కలదు. మిగతా ఏవిధమైన మెకానిక్ మార్పులు చోటు చేసుకోలేదు.

ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ సుమారుగా 85పిఎస్ పవర్ మరియు 110పిఎస్ పవర్ ఉత్పత్తి చేసే విధంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఎక్ట్సీరియర్ పరంగా ఈ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ గ్రే, పియర్ల్ వైట్, మూన్ లైట్ మరియు ఔట్‌బ్యాక్ బ్రాంజ్ అనే విభిన్న రంగుల్లో లభించును.

ఈ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌కు ముందు వైపున ముందు వైపున గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బాడీ క్లాడింగ్, ఫాగ్ ల్యాంప్స్, స్పెషల్ రూఫ్ రెయిల్స్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ బ్యాడ్జిలు కలవు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ క్యాబిన్ లోపలి వైపున డెనిమ్ ఆధారిత అప్‌హోల్‌స్ట్రే కలదు. లెథర్ తొడుగులుగల స్టీరింగ్ వీల్ మీద పసుపు రంగుతో కుట్టబడిన డిజైన్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్యాష్‌బోర్డ్‌ని కూడా పసుపు సమ్మేళనంతో ప్రత్యేకం చేసారు.

రెనో అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్

రెనో అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్



Click it and Unblock the Notifications








