మార్చిలో విడుదలకు సిద్దమైన రెనో డస్టర్ ఎఎమ్‌టి ఫేస్‌లిఫ్ట్
ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యువిని ఏఎమ్‌టి వెర్షన్ ఫేస్‌లిఫ్ట్ అవతారంలో ప్రదర్శించింది. రెనో ఇండియా మార్కెట్లోకి తమ డస్టర్ ఎస్‌యువిని విడుదల చేసిన అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. దీనిని దృష్టిలో పెట్టుకుని డస్టర్‌ను ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో పరిచయం చేసింది. అయితే దీనిని ఈ ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

రెనో ఇండియా ఈ ఫేస్‌లిఫ్ట్ డస్టర్‌లో 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించారు. ఇది ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ దాదాపుగా 108.50 బిహెచ్‌పి పవర్ మరియు 248 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని సిటీ మరియు హైవేల మీద నడపడానికి ఎంతో మంచి అనుభూతిని ఇస్తుంది.
Also Read: ఎకో స్పోర్ట్‌తో పోటీ పడుతున్న మారుతి సుజుకి వితారా బ్రిజా
రెనో ఇంజనీర్లు ఈ ఫేస్‌లిఫ్ట్ డస్టర్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌కు కొన్ని మార్పులు కల్పించారు. డ్యూయల్ టోన్ డాష్ బోర్జ్ మరియు మరింత స్పేస్ కల్పించడం కోసం బూట్ స్పేస్‌ను పెంచారు. ఈ 2016 మోడల్ డస్టర్‌లో అధునాతనమైన భద్రత ఫీచర్లను కూడా కల్పించారు. అందులో బ్రేక్ అసిస్ట్, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్, రెండు ఎయిర్ బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇఎస్‌పి, పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కలవు.
Also Read: హెక్సా క్రాసోవర్‌తో టాటా మోటార్స్ దశ మారనుందా...?
2016 రెనో డస్టర్ ధర సాధారన డస్టర్ ధర కన్నా 25,000 రుపాయలు వరకు అదనంగా ఉండవచ్చు. వచ్చే నెలలో దీనిని మార్కెట్లోకి లాఛనంగా విడుదల చేయనున్నారు. అంత వరకు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి మరిన్ని అప్‌డేట్స్‌ను తెలుగులో పొందండి.


Click it and Unblock the Notifications





























