ఏఎమ్‌టి డస్టర్ ఫేస్ లిఫ్ట్ ఎంట్రీ : కెయువి100 అంతం
రెనో ఇండియా దిల్లీలో జరుగుతున్న 2016 ఆటో ఎక్స్ పోలో తమ ఏఎమ్‌టి వర్షన్‌కు చెందిన ఫేస్ లిఫ్ట్ డస్టర్‌ను ప్రదర్శించింది. అయితే దీని రాకతో గత నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల కెయువి 100 ఎస్‌యువికి కొంచెం పోటి ఎదురైందని తెలుస్తోంది.
AUTO EXPO NEWS: టాటా మోటార్స్ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ ప్రదర్శన: వివరాలు
రెనో డస్టర్ ఏఎమ్‌టి ఫేస్ లిఫ్ట్ ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

రెనో డస్టర్ ఇంజన్ వివరాలు
రెనో డస్టర్ ఫేస్ లిఫ్ట్ ఎస్‌యువిలో రెండు రకాల ఇంజన్‌లు కలవు. అవి 1.5-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్

పవర్
రెనో డస్టర్ ఫేస్ లిఫ్ట్ లోని ఇంజన్ విడుదల చేసే పవర్, డీజల్ ఇంజన్ 3750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు 84 బిహెచ్‌పి పవర్ మరియు పెట్రోల్ ఇంజన్ 5850 ఆర్‌పిఎమ్ వేగం వద్ద దాదాపుగా 103 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేయును.

టార్క్
ఎస్‌యువిలలో టార్క్ ఎంతో ముఖ్యం. రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యువి కారులో గల డీజల్ ఇంజన్ 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు పెట్రోల్ ఇంజన్ 2250 ఆర్‌పిఎమ్ వేగం వద్ద గరిష్టంగా 248 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేయును.

మైలేజ్
- డస్టర్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ ఇంజన్ లీటర్‌కు 20.64 కిలోమీటర్లు
- డస్టర్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 13.2 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయి.
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- బ్రేక్ అసిస్ట్ గల ఇబిడి
- ఎలక్ట్రానికి స్టెబిలిటి కంట్రోల్
- డ్యూయల్ ఎయిర్ బ్యాగ్
- క్రూయిజ్ కంట్రోల్
- స్పీడ్ లిమిటెడ్
- రియర్ వ్యూవ్ కెమెరా
- ఎకో డ్రైవింగ్ మోడ్
- హోండా నవీ క్రాసోవర్ ధర. 39,500 లు: ఫోటోలు
- ఆటో ఎక్స్ పోలో బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించిన హోండా మోటార్స్

క్రొత్త గేర్ బాక్స్
డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యువి కారులో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే క్రొత్త గేర్ బాక్స్. ఇంతకు ముందు రెనో వారు ప్రవేశ పెట్టిన డస్టర్ ఎస్‌యువి మంచి ఫలితాలనే నమోదు చేసుకుంది. అందుకోసం రెనో ఇండియా ఇప్పుడు తమ ఫేస్‌లిఫ్ట్ డస్టర్ ఎస్‌యువిలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ఈజి-ఆర్ గేర్ బాక్స్‌ను అందించారు.

డిజైన్
ఆటో ఎక్స్ పో వేదిక మీద కొలుదీరిన డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యువి సాధారణ ఎస్‌యువి కన్నా కొన్ని మార్పులతో డిజైన్ చేయబడింది. హాకీ క్లస్టర్ అని పిలువబడే సరికొత్త హెడ్‌లైట్లతో డిజైన్ చేశారు. ముందు వైపు రీ డిజైన్ చేయబడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్ కల్పించారు.

ఎక్ట్సీరియర్ డిజైన్
గన్ మెటల్‌తో ఫినిషింగ్‌తో వచ్చిన సరికొత్త అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్, ఆశ్చర్యం కలిగించే గ్రాఫిక్స్‌తో డిజైన్ చేయబడిన ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ ఎంతో స్మూత్‌గా దర్శనం ఇస్తాయి. మరియు వెనుకవైపున కూడా మోడిఫైడ్ బంపర్ కల్పించారు.

ఇంటీరియర్ డిజైన్
డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు లోపల సెడార్‌వుడ్ బ్లాక్ థీమ్‌ను ప్రీమియమ్ వేరియంట్‌లోపల డిజైన్ చేశారు. ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఆటోమేటిక్ ఎ/సి గల సెంటర్ కన్సోల్‌ను నూతనంగా డిజైన్ చేశారు. దీని ఇంటీరియర్ లోపల్ దాదాపుగా నలుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ లోని టాప్ ఫీచర్లు

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ లోని టాప్ ఫీచర్లు

పోటి
రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన వితారా బ్రిజా ఎస్‌యువిలకు పోటిగా నిలవనుంది.

అందుబాటులోకి
రెనో ఇండియా ఈ డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యుని ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.



Click it and Unblock the Notifications








