డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్‌ను విడుదల చేసిన రెనో: ధర మరియు ఇతర వివరాల కోసం
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనో ఇండియన్ మార్కెట్లోకి తమ డస్టర్ లేటెస్ట్ ఎడిషన్ ఆటోమోటిక్‌ను క్రితం రోజు భారతీయ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో రెనో వారు అందించిన రెనో డస్టర్ మంచి ఫలితాలను సాధించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రెనో ఈ డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను అందించిందని తెలుస్తోంది.
రెనో వారి సరికొత్త డస్టర్ ఫేస్‌లిఫేఫ్ట్ ఆటోమేటిక్ ఎస్‌యువికి చెందిన ధర, ఇంజన్, మైలేజ్, డిజైన్ మరియు ఫీచర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డస్టర్ ఆటోమేటిక్ ధర
- డస్టర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.46 లక్షలు
- ఈజీ ఆర్ ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ. 11.47 లక్షలు
- ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 13.57 లక్షలు
- 1.5-లీటర్ డీజల్ ఇంజన్
- 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్
- భారతీయుని అత్భుత సృష్టి పూర్తిగా డ్రైవర్ రహిత కారు ఆవిష్కరణ.
- రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు
- మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు.
గమనిక: అన్ని ధర లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

ఇంజన్ వివరాలు
రెనో ఈ సరికొత్త డస్టర్ ఆటోమేటిక్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

పవర్ వివరాలు
రెనో డస్టర్ ఆటోమేటిక్ వాహనంలో గల డీజల్ ఇంజన్ దాదాపుగా 3,750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 84 బిహెచ్‌పి పవర్ మరియు 3,900 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నపుడు 109 బిహెచ్‌పి అత్యధిక పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా పెట్రోల్ ఇంజన్ 5,850 ఆర్‌పిఎమ్ వేగం వద్ద అత్యధికంగా 103 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్ వివరాలు
రెనో డస్టర్ ఆటోమేటిక్‌లో గల డీజల్ ఇంజన్ 19,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 200 ఎన్ఎమ్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 248 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు పెట్రోల్ ఇంజన్ 2,250 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 248 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

గేర్‌బాక్స్ వివరాలు
పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను మరియు ఈజీ-ఆర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రస్తుతం డీజల్ ఇంజన్ గల వాహనంలో మాత్రమే అందించారు.

మైలేజ్
డీజల్ ఇంజన్ లీటర్‌కు గరిష్టంగా 20.64 కిలోమీటర్లు, కనిష్టంగా 19.1 కిలోమీటర్లు అధేవిదంగా పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 13.2 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తాయి.

డిజైన్
సరికొత్త డస్టర్ కారు ముందు భాగంలో గల హెడ్ లైట్లను మరియు ఫ్రంట్ గ్రిల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ముందు వైపు గల బంపర్‌ను కొత్తగా డిజైన్ చేశారు.

ఫీచర్లు
నాలుగు చక్రాలు కూడా గన్‌మెటల్ గ్రే అల్లాయ్ వీల్స్‌తో తయారు చేశారు, దీనితో పాటు సరికొత్త ఆరేంజ్ రంగు గల పెయింట్ ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు నూతన గ్రాఫిక్స్ గల ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్‌ను అందించారు.

ఇంటీరియర్‌లో కొత్తవి
ముందు మోడల్ డస్టర్‌లో కొన్నింటికి మార్పులు చేశారని తెలుస్తోంది. అందులో కొత్తగా డిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్‌గా ఎ/సి ని నియంత్రించే వెసులుబాటు కల్పించారు.

బుకింగ్స్
రెనో డస్టర్ ఆటోమేటిక్ ఫేస్‌లిఫ్ట్‌కు చెందిన బుకింగ్స్ నేటి నుండి (మార్చి 3, 2016) దేశవ్యాప్తంగా గల రెనో డీలర్స్ వద్ద బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications








