ట్రక్కు అవతారంలో రెనో డస్టర్
రెనో ఇండియా వారి డస్టర్ ప్రస్తుతం ఇండియన్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఎంతో ఉత్తమమైన కారు. దీనికిదే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే గత వారంలో ఉన్నట్లుండి ఈ ఎస్‌యువి కేరళలో పికప్ ట్రక్ రూపంలో దర్శనం ఇచ్చి మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రెనో తమ డస్టర్‌ను ఇలా పిక్‌ప్ వాహనంగా ఎప్పుడు అందుబాటులోకి తెచ్చింది అనేగా మీ డౌట్. దానికి సమాధానం క్రింది స్లైడర్లలో కలదు వాటి మీద ఓ లుక్కేయండి మరి...

కేరళలోని ఒక వ్యక్తి డస్టర్ వాహనాన్ని ఇలా పికప్ ట్రక్కు రూపంలోకి మోడిఫై చేయించుకున్నాడు.

వెనుక నుండి చూస్తే దీనిని వెనుక వైపున ఉన్న బాగాన్ని పై నుండి క్రింది వరకు సగానికి తొలగించి మోడి ఫై చేసారు.

సాధారణంగా మనం రోడ్ల మీద చూసే రెండు క్యాబిన్‌లు గల పికప్ ట్రక్ తరహాలో ఉంది.

వెనుక వైపున ఉన్న టెయిల్ ల్యాంప్స్ మరియు టెయిల్ గేట్లు రెండు కూడా ముందున్న ప్రదేశంలో కాకుండా కాస్త క్రింద నూతన డిజైన్‌లో మోడిఫై చేసి అందించారు.

ఇక ముందు వైపు ఉన్న ఫ్రంట్ గ్రిల్‌ను పియానో బ్లాక్ రంగుల్లో డిజైన్ చేసారు. అలాగే హెడ్‌లైట్లను కూడా మోడిఫై చేశారు.

రెనో వారి అందించిన నాలుగు చక్రాలను కూడా నల్లటి రంగుల్లో మోడి ఫై చేసారు.

ఇవి కాకుండా ఇందులో ఇంజన్‌కు సంభందించిన ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ఈ మోడి ఫైడ్ డస్టర్ పికప్ ట్రక్ బ్రెజిల్ మార్కెట్లో రెనో అందుబాటులో ఉంచిన ఒరోచ్ అనే ట్రక్‌ను పోలి ఉంది.

దీని ధర సుమారుగా మన ఇండియన్ రుపాయల్లో సుమారుగా 12 లక్షల రుపాయలుగా ఉంది.

మన ఇండియన్ మోడి ఫై చేసిన డస్టర్ పికప్ ట్రక్కుకు మరియు బ్రెజిల్‌లో ఉన్న ఒరోచ్ ట్రక్ డిజైన్ పరంగా కొంచెం వ్యత్యాసం ఉంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో క్యాబిన్‌తో అందుబాటులో ఉన్న వాహనాలు
టాటా జెనాన్
మహీంద్రా స్కార్పియో గేట్‌వే
మహీంద్రా బొలెరో
మహీంద్రా జైలో పికప్ ట్రక్ వంటివి అందుబాటులో కలవు.

మోడిఫైడ్ రెనో డస్టర్ పికప్ ట్రక్క్

బాగా చూడండి ఇది మహీంద్రా వారి మోడిఫైడ్ ఎక్స్‌యువీ500
స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో పట్టుబడిన నయా స్పార్పియో..!!


Click it and Unblock the Notifications








