క్విడ్ పై అరుదైన ఆఫర్: క్యాష్ బ్యాక్, క్యాష్ లెస్ పేమెంట్, 100 శాతం బుణం
రెనో ఇండియా కస్టమర్లకు ఒక శుభవార్త, రెనో తమ బెస్ట్ సెల్లింగ్ క్విడ్ ను క్యాష్ లెస్ పేమెంట్ ద్వారా ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
రూ. 500 మరియు 1000 ల నోట్ల రద్దు కారణంగా కొనుగోళ్లు మరియు ఇతర సర్వీసుల మీద నగదు చెల్లించడానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే ఇలాంటి అసౌకర్యాలను దూరం చేయడానికి రెనో తమ కార్లను ఎంచుకునేటప్పుడు మరియు వాటికి సర్వీసింగ్ నిర్వహించేటప్పుడు నగదు రహిత చెల్లింపులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.

2016 చివర్లో పండుగ సీజన్ మరియు సంత్సరాంతపు కొనుగోళ్లు జోరందుకుంటున్న నేపథ్యంలో మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం ఆటో పరిశ్రమలోని అమ్మకాలు భారీ పతనానికి కారణమయ్యింది. ఒక్క సారిగా అమ్మకాలు స్తంభించిపోయాయి.

అయితే ఇప్పటికే చాలా వరకు కార్లు మరియు బైకుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నాయి. జీరో డౌన్ పేమెంట్ మరియు క్యాష్ లెస్ పేమెంట్ ఆప్షన్ (నగదు రహిత చెల్లింపులు) లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

మార్కెట్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచానా వేస్తుంది, వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకునే మారుతి సుజుకి 100 బుణ సదుపాయం కల్పిస్తూ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

అయితే మారుతి చాలా దగ్గరి దారిలో రెనో ఇండియా వచ్చింది, తమ ఉత్పత్తుల కొనుగోళ్లు మరియు నగదు చెల్లింపుల ద్వారా జరిగే లావాదేవీలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ క్యాష్ లెస్ పేమెంట్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది.

వినియోగదారులు పేటిఎమ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి పేజాప్ ద్వారా క్యాష్ లెస్ పేమెంట్స్ (నగదు రహిత చెల్లింపులు) చేయవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న రెనో డీలర్లు తమ పోర్ట్ ఫోలియోలోని అన్ని వేరియంట్ల మీద 100 శాతం బుణ సదుపాయం కల్పిస్తున్నాయి.

ఆన్ లైన్ మరియు నగద రహిత చెల్లింపులతో పాటు డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కులు. డెబిట్/క్రెడిట్ కార్డులు వంటి వాటిని రెనో డీలర్లు ఆంగీకరిస్తున్నారు.

అంతే కాకుండా నగదు చెల్లింపుల కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) మరియు ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) వంటి సేవలను కూడా వినియోగించుకుంటున్నాయి.

రెనో ఇండియా లైనప్‌లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ క్విడ్ మీద అన్ని రకాల చెల్లింపులు మరియు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరియు పేటిఎమ్ ద్వారా బుక్ చేసుకునే కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

రెనో క్విడ్ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ ద్వారా కూడా కస్టమర్లు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు పొందవచ్చు.

- సుజుకి సియాజ్ హైబ్రిడ్ సిద్దమైన పోటీ..!!
- బజాజ్ నుండి వి15 తరహాలో వి12 బైకు
- బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు


Click it and Unblock the Notifications








