రెనో ఇండియా డిసెంబర్ ఆఫర్లు: లక్ష రుపాయల వరకు ప్రయోజనాలు
రెనో ఇండియా ఈ ఏడాదికి చివరి మాసమైన డిసెంబర్ ఆఫర్లను ప్రటించింది. తమ ఉత్పత్తుల మీద గరిష్టం లక్ష రుపాయల వరకు ఆఫర్లతో పాటు 100 శాతం బుణ సదుపాయం కల్పిస్తోంది.
ఫ్రెంచ్ కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ ఉత్పత్తులపై సంవత్సరాంతపు ఆఫర్లను ప్రకటించింది. తమ లైనప్‌లో ఉన్న ఎంచుకోదగ్గ ఉత్పత్తులపై లక్ష రుపాయల వరకు గరిష్ట ప్రయోజనాలతో పాటు 100 శాతం బుణ సదుపాయ అందిస్తోంది. రెనో డిసెంబర్ సెలబ్రేషన్స్ ద్వారా లభించే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు...

భారతీయుల ఎంతగానో ఇష్టపడుతున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను 100 శాతం ఫైనాన్స్ ద్వారా ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. కస్టమర్లు ఈ క్విడ్ పై జీరో డౌన్‌పేమెంట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు.

రెనో శ్రేణిలో ఉన్న పల్స్ హ్యాచ్‌బ్యాక్ మీద 40,000 రుపాయల వరకు క్యాష్ బ్యాక్ లేదంటే ఆకర్షణీయమైన 4.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంతే కాకుండా ఈ రెనో డిసెంబర్ సెలబ్రేషన్ ఆఫర్ క్రింద పల్స్ ఎంచుకునే వారికి 5,000 రుపాయల విలువైన యాక్ససరీల ఉచితం.

రెనో స్కాలా సెడాన్ మీద గరిష్టంగా 90,000 రుపాయల వరకు లాభాలను అందిస్తోంది. మరియు స్కాలా ఎంపికపై కూడా ఐదు వేల రుపాయల విలువైన యాక్ససరీలను ఉచితంగా అందిస్తోంది. 100 శాతం బుణ సదుపాయంతో పాటు విభిన్న ఫైనాన్స్ స్కీమ్స్‌ను డీలర్లు అందిస్తున్నారు.

రెనో లైనప్‌లో ఉన్న లాజీ ఎమ్‌పివి మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు ఆఫర్‌తో పాటు 5,000 రుపాయల విలువైన ఉచిత యాక్ససరీలను అందిస్తోంది. అంతే కాకుండా రెనో లాజీ ని 100 శాతం ఫైనాన్స్ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించారు.

రెనో డస్టర్ ఎస్‌యువి మీద గరిష్టంగా 80,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది. మరియు రెనో ఆటోమేటిక్ వేరియంట్ మీద 60,000 రుపాయల గిఫ్ట్ చెక్ అందివ్వనుంది. రెనో తమ డస్టర్ ఎస్‌యువిలను కూడా 100 శాతం ఫైనాన్స్‌తో ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది.

- రూ. 2,50,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
- మారుతి ఎంట్రీ లెవల్ ఉత్పత్తుల పై భారీ ఆఫర్లు మరియు అరుదైన డిస్కౌంట్లు
- విపణిలోకి విడుదలైన నిస్సాన్ జిటి-ఆర్: ధర రూ. 1.99 కోట్లు


Click it and Unblock the Notifications








