2016 పండుగ సీజన్ కోసం రెనో వారి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రతి వాహన తయారీ సంస్థ కూడా దేశీయంగా ప్రారంభమైన పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి సిద్దమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం మొత్తం కోల్పోయిన అమ్మకాలను రానున్న నాలుగు నెలల్లో తిరిగి పొందే అవకాశం ఇది. అందుకోసం విభిన్నమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి వాహన తయారీ సంస్థలు.

2016 పండుగ సీజన్ కోసం రెనో ఇండియా అద్భుతమైన ఆఫర్లను మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. రెనో వారి ప్రతి ఉత్పత్తి బుకింగ్ మీద ఖచ్చితంగా రెండు గ్రాముల బంగారు నాణాన్ని ఉచితంగా అందిస్తున్నారు.

అంతే కాకుండా దేశ వ్యాప్తంగా రెనో ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు టెస్ట్ డ్రైవ్ తరువాత ఆశ్చర్యకరమైన బహుమతులు అందివ్వనుంది రెనో ఇండియా.

వ్యక్తిగతంగా రెనో వారి ఉత్పత్తులను అక్టోబర్ 2016 లో కొనుగోలు చేసే వారికి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ను కలిసే అవకాశాన్ని కల్పిస్తోంది రెనో ఇండియా.

రెనో లోని డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద 40,000 రుపాయల విలువైన చెక్ రూపంలో బహుమానంగా లేదా 7.77 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నారు.

పండుగ సీజన్ ఆఫర్ల సందర్భంగా రెనో డస్టర్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మ్యాన్యువల్ వేరియంట్ ధరతో అందిస్తున్నారు.

రెనో డస్టర్ ఆటోమేటిక్ వేరియంట్ మీద సుమారుగా 80,000 రుపాయల విలువైన ఆఫర్లను అందిస్తోంది.

రెనో వారి పల్స్ హ్యాచ్‌బ్యాక్ మీద అక్టోబర్ 2016 కు గాను సుమారుగా 40,000 రుపాయల విలువైన కాష్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది.

రెనో ఇండియా తమ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను నెలసరి వాయిదా పద్దతుల్లో తీసుకునే వారికి అత్యంత ఆకర్షణీయమైన 4.49 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

రెనో ఎమ్‌పివి లాజీ (ఆర్ఎక్స్ఇ మరియు ఆర్ఎక్స్ఎల్) మీద సుమారుగా 20,000 రుపాయల విలువైన గిఫ్ట్ చెక్ అందిస్తున్నారు.

రెనో లాజీ లోని ఆర్ఎక్స్ఎల్ 85పిఎస్ వేరియంట్ మీద మాత్రమే గరిష్టంగా 40,000 రుపాయల గిఫ్ట్ చెక్ అందిస్తున్నారు.

రెనో ఇండియా తమ స్కాలా సెడాన్ ను కేవలం రూ. 1 తో ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తోంది.

రెనో తమ బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మరియు క్విడ్ 1.0-లీ మీద ఏ విధమైన ఆఫర్లను అందివ్వలేదు.

- 2016 పండుగ సీజన్‌లో ఫియట్ ఆఫర్ల మోత...!!
- ఇండియన్ మార్కెట్లోకి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న మిత్సుబిషి
- భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మరియు కార్గో వ్యాన్ విడుదల


Click it and Unblock the Notifications








