2017 ప్రారంభ నుండి ధరలను పెంచనున్న రెనో ఇండియా
రెనో ఇండియా తమ దేశీయ లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల మీద 2017 జనవరి నుండి ధరలను పెంచనుంది.
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో దేశీయంగా ఉన్న తమ అన్ని ఉత్పత్తుల మీద 3 శాతం వరకు ధరలను పెంచాలనే ఆలోచనలో ఉంది. తయారీ మీద ఎక్కువ ఖర్చవుతున్న నేపథ్యంలో ధరల పెంపును చేపడుతున్నట్లు తెలిసింది. నూతన ధరలు 2017 ప్రారంభం నుండి అమల్లోకి రానున్నాయి.

రెనో గత కొంత కాలం నుండి దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచాలని ప్రయత్నిస్తోంది. అయితే నూతన సంవత్సరం ఈ ధరల పెంపుకు వేదిక కానుంది.

రెనో ఇండియా ఆపరేషన్స్ సిఇఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, ధరల పెరుగుదల వీలైనంత వరకు తక్కువగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది నుండి అమలు కానున్న ధరల పెంపు సుమారుగా 1.5 నుండి 3 శాతం మధ్య ఉండనున్నట్లు తెలిసింది.

వాహన నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహించే స్టీల్, ప్లాస్టిక్ మరియు రబ్బర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం దీనికి ముఖ్య కారణం అని సుమిత్ గారు తెలిపాడు.

ధరల పెంపు ప్రకటించిన తరువాత రెనో బెస్ట్ సెల్లింగ్ కారు క్విడ్ ధర రూ. 2.64 లక్షలు మరియు రెనో డస్టర్ ప్రారంభ ధర రూ. 13.77 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండవచ్చు.

గత వారంలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల మీద సుమారుగా 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. పెరిగిన ధరలు 2017 జనవరి నుండి అమల్లోకి రానున్నట్లు టయోటా తెలిపింది.

- ఇండియన్ రైల్వేలోకి మరో అరుదైన సర్వీసు
- ఇన్నోవా క్రిస్టాకు సరైన పోటీ జనవరి 18 న విడుదల...!!
- టాప్ 10 జాబితాలో కొత్త కార్ల స్థానం: మొదటి సారిగా టాటా ఎంట్రీ...!!


Click it and Unblock the Notifications








