ఈ ఏడాదిలోపు భారీ లక్ష్యం మీద గురి పెట్టిన రెనో ఇండియా
రెనో ఇండియా గడిచిన నాలుగేళ్లలో రెండు ఉత్పత్తులతో పరిధులు దాటి విజయాన్ని సాధించింది. రెనో డస్టర్ మరియు రెనో క్విడ్ ఉత్పత్తులు రెండు కూడా విభిన్న స్థాయి కస్టమర్లను భారీగా ఆకట్టుకున్నాయి. 2016 లోపు ఈ రెండు ఉత్పత్తులతో పాటు మొత్తం లక్ష అమ్మకాల మైలు రాయిని దాటించే ప్రయత్నం చేస్తోంది.

2016 జనవరి నుండి ఆగష్టు వరకు సుమారుగా 87,000 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇందులో సుమారుగా 65,000 వరకు క్విడ్ అమ్మకాలు ఉన్నాయి.

గడిచిన ఏడాది 2015 లో రెనో ఇండియా 50,000 అమ్మకాలు జరిపింది. క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రెనో వారికి మంచి సంవత్సరం అని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, సంస్థకు సంభందించి భవిష్యత్ ప్రణాళికలో 2017 నుండి ఇండియన్ మార్కెట్లోకి ప్రతి ఏడాది ఒక ఉత్పత్తిని విడుదల చేస్తామని తెలిపాడు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి తాజాగా వచ్చిన ఉత్పత్తుల్లో రెనో క్విడ్ మంచి అమ్మకాలు సాధిస్తోంది. రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఇండియాలోని చిన్న కార్ల సెగ్మెంట్లకు మంచి గిరాకీ ఉందని తెలిపాడు.

రెనో క్విడ్ దేశీయంగానే కాకుండా శ్రీలంక, నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలకు భారీగా ఎగుమతి అవుతోంది.

- చైనాలో విమాన రెస్టారెంట్: భారత్‌లో ఎక్కడుందో తెలుసా ?
- షాక్: 150సీసీ సామర్థ్యం గల బైకును విడుదల చేయనున్న బెనెల్లీ
- జేమ్స్‌బాండ్ మూవీ షూట్ కాదండోయ్... పోర్షే ప్యానమెరా ప్రదర్శన !!
- ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!



Click it and Unblock the Notifications








