ఆశ్చర్యపరిచే రీతిలో నమోదైన రెనో క్విడ్ బుకింగ్స్
రెనో ఇండియా దేశీయ విపణిలోకి విడుదల చేసిన అత్యంత సరసమైన కారు మార్కెట్ వర్గాలు ఏ మాత్రం అంచనా వేయని రీతిలో బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 1.5 లక్షలుకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. చౌక కార్ల విభాగంలో క్విడ్ విప్లవాన్ని సృష్టించిందని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

ఎంట్రీలెవల్ సెగ్మెంట్లోకి రెనో సరికొత్త డిజైన్ ఫిలాసఫితో దీనిని అభివృద్ది చేసింది. చిన్న కారే అయినప్పటికీ ఎస్‌యువి తరహా డిజైన్‌ను పోలి ఉండటం దీనికి బాగా కలిసొచ్చింది. కొత్త డ్రైవింగ్ నేర్చుకున్న వారికి మరియు కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది ఎంతగానో ఫేవరెట్ అయిపోయింది.
Also Read: ఇదే పరిస్థితి కొనసాగితే, ఆల్టో కథ కంచికే...!!
సాంకేతికంగా రెనో క్విడ్‌లో 0.8 లీటర్ (800సీసీ) సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‍ను అనుసంధానం చేశారు. ఇది లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలగదు.


Click it and Unblock the Notifications























































