దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

By Anil

రెనో ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ క్విడ్ 1.0-లీటర్ మరియు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్‌ను ప్రదర్శించింది. ఫ్రెంచ్ దేశానికి చెందిన రెనో ఈ క్విడ్ 1.0-లీటర్ ఇంజన్ కారును వచ్చే దీపావళికి ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

రెనో క్విడ్ 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ వేరియట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

రెనో అభివృద్ది చేసిన ఇందులో 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

ఇది దాదాపుగా 67 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం ఇందులో ప్రత్యేకంగా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

అయితే రెనో ఇండియా దీనికన్నా ముందుగా ఇండియన్ మార్కెట్లోకి క్విడ్ 800సీసీ కారును అందించిన విషయం విధితమే.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

లక్కీగా రెనో క్విడ్ రెండు మోడల్ కార్లు అయిన క్విడ్ 800సీసీ మరియు 1.0-లీటర్ లలో ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

క్విడ్ పాత మోడల్‌తో దీనిని పోల్చుకుంటే ఇందులో కొత్తగా 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను గుర్తించవచ్చు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

అయితే ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఇందులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

అయితే పాత మోడల్‌తో దీనిని పోల్చినపుడు కొంచెం వేరుగా కనిపించడానికి కొన్ని కొత్త రంగుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

భధ్రత పరంగా రెనో క్విడ్ కార్లలో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానికల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని ఇందులో అందిస్తున్నారు.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

ధర పరంగా సాధారణ క్విడ్తో పోల్చుకుంటే ఈ 1.0-లీటర్ ఏఎమ్‌టి క్విడ్ ధర ఎక్కువగానే ఉండనుంది.

 దీపావళకి విడుదల కానున్న రెనో క్విడ్ 1.0-లీటర్

ఇండియన్ మార్కెట్లోకి క్విడ్ 1.0-లీటర్ ఆటోమేటిక్ విడుదల అయితే ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10 ఆటోమేటిక్ మోడల్‌కు పోటిగా నిలవనుంది.

Article Published On: Wednesday, April 13, 2016, 13:41 [IST]
English summary
Renault Kwid 1.0-Litre Engine & AMT Launching Prior To Diwali
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+