దేశీయంగా విడుదల కానున్న క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌‌టి: పూర్తి వివరాలు

By Anil

నిన్న మొన్న వచ్చిన కొత్త కార్ల సంస్థలు తమ దైన శైలిలో మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటున్నాయి. అందులో రెనో ఒకటి ఎన్నో ఏళ్ల నుండి దేశీయ మార్కెట్లో తిష్ట వేసి కూర్చున్న ఆల్టో 800 వంటి వాటి మూలాలు కదిలిపోయే విధంగా క్విడ్‌ను విడుదల చేసింది. గత ఏడాదిలో రెనో విడుదల చేసిన క్విడ్ భారీ అమ్మకాల దిశగా అడుగులువేస్తోంది. దీని కారణంగా ఇప్పటికే ఆల్టో 800 అమ్మకాల్లో కోతలు పడుతున్నాయి.

క్విడ్ విజయాన్ని అనుసరిస్తూ, దానికి కొనసాగింపుగా క్విడ్ 1.0-లీటర్ ఇంజన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందిస్తోంది. దీనిని ఈ ఏడాదిలోపు విడుదల చేయనుంది. దీని గురించి పూర్తి వివరాలు...

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన 800సీసీ సామర్థ్యం ఉన్న క్విడ్ ద్వారా 5 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ క్విడ్ కారును 1.0-లీటర్ ఇంజన్‌తో పాటు ఆటేమేటిక్ గేర్‌ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వడానికి సిద్దమైంది

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

1.0-లీటర్ మరియు ఏఎమ్‌టి గల క్విడ్‌లో రెనో ఎఫ్1 బృందం అభివృద్ది చేసిన ఈజీ-ఆర్(Easy-R) గేర్ షిఫ్ట్ గల ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

రెనో ఇండియా గత ఏడాదిలో విడుదల చేసిన క్విడ్ సుమారుగా 75,000 అమ్మకాలను సాధించింది. రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ షానే మాట్లాడుతూ, రెనో క్విడ్ దేశ వ్యాప్తంగా బాగా అంగీకరించబడిన ఉత్పత్తి, ఇదే తరహాలోనే క్విడ్ 1.0-లీటర్ ఫలితాలను సాధిస్తుందని తెలిపారు.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మంచి పనితీరు ప్రదర్శించే ఇంజన్‌లను కోరుకునే వారి కోసం ఈ 1.0లీటర్ ఇంజన్‌ను క్విడ్ ద్వారా వివిధ రకాల వేరియంట్లలో అందివ్వనున్నట్లు తెలిసింది.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద రెనో తమ క్విడ్ 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌ను ప్రదర్శించింది.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఇందులోని 1.0 లీటర్ ఇంజన్ సరికొత్త 1.0 ఎస్‌సిఇ (స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సీ) సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ఈ ఇంజన్‌లో రెండు ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్‌లు మరియు ప్రతి సిలిండర్‌కు నాలుగు వాల్వ్‌లు ఉంటాయి.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఇది దేశీయంగా విడుదల అయితే దీని సుమారుగా రూ. 3.25 లక్షలు నుండి 4.15 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండనుంది.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ఈ రెనో క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆల్టో కె10 కు గట్టి పోటీగా నిలనుంది.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

రూపం పరంగా క్విడ్ 800సీసీ నే పోలి ఉన్నప్పటికీ ప్రక్క వైపుల డోర్ల మీద గ్రాఫిక్స్ మరియు వెనుక వైపున 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్‌ను సూచించే బ్యాడ్జిని కల్పించారు.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి

ప్రపంచ విమానయాన రంగం గురించి విస్మయపరిచే నిజాలు

త్వరలో ఇండియాలో విడుదల కానున్న రెనో కార్లు

More from DriveSpark

Article Published On: Friday, August 5, 2016, 11:08 [IST]
English summary
Renault To Launch Kwid 1.0-Litre (AMT) In India: More Details
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+