భారీ విజయంతో దూసుకెళ్తున్న రెనో క్విడ్

By Anil

రెనో ఇండియా వారి జాతకం సెప్టెంబర్ 24, 2015 నుండి పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఫ్రెంచ్‌కు చెందిన రెనో ప్రతి ఏడాది కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చింది. అయితే గత ఏడాది క్విడ్ విడుదలతో దేశీయ మార్కెట్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది.

రెనో క్విడ్

క్విడ్ విడుదలై ఏడాది అయినప్పటికీ అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. పోటీగా ఉన్న వాటిని దెబ్బతీస్తూ భారీ అమ్మకాల దిశగా దూసుకెళుతోంది.

రెనో క్విడ్

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ పునాదులు కదిలేలా క్విడ్ అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన సెప్టెంబర్ 2016 లో ఏకంగా 10,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

రెనో క్విడ్

ప్రస్తుతం ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మారుతి ఆల్టో మరియు క్విడ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. క్విడ్ అమ్మకాలు పెరిగినప్పటికీ మారుతి ఆల్టో స్థిరమైన అమ్మకాలు సాధించి ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచింది.

రెనో క్విడ్

క్విడ్ 800సీసీ వేరయంట్ విజయానికి కొనసాగింపుగా క్విడ్‌ను 1.0-లీటర్ ఇంజన్‌లో పరిచయం చేసింది రెనో. ఇది మైలేజ్ మరియు పనితీరు పరంగా మంచి పనితనం కబరుస్తోంది.

రెనో క్విడ్

గత ఏడాది సెప్టెంబర్‌లో 1,781 యూనిట్ల క్విడ్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే 2016 సెప్టెంబర్‌లో 12,300 యూనిట్ల అమ్మకాలు సాధించి 590శాతం వృద్దిని సాధించింది.

రెనో క్విడ్

రెనో క్విడ్‌ను విడుదల చేసిన మొదటి ఎనిమిది నెలల కాలంలో 1.65 లక్షల బుకింగ్స్ కాగా 65,000 యూనిట్లను డెలివరీ ఇచ్చింది.

రెనో క్విడ్

2016 చివరి నాటికి ఒక లక్ష యూనిట్ల క్విడ్ కార్లను డెలివరీ ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. ప్రతి నెల భారీ అమ్మకాలు సాధిస్తోంది కాబట్టి రెనో ఇండియాకు ఇదేం పెద్ద సవాల్ కాదు.

రెనో క్విడ్

ప్రారంభంలో రెనో ఇండియా 799సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ అందించింది. ఇది సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

రెనో క్విడ్

రెనో ఎస్‌సిఇ పరిజ్ఞనంతో అభివృద్ది చేసిన ఈ ఇంజన్ లీటర్‌కు 25కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

రెనో క్విడ్

రెనో ఇండియా తాజాగ క్విడ్‌లో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది లీటర్‌కు 23కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

రెనో క్విడ్

క్విడ్‌లోని 1.0-లీటర్ ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

రెనో క్విడ్

క్విడ్ లోని రెండు ఇంజన్‌ ఆప్షన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది. రెనో తమ క్విడ్ 1.0-లీటర్ మరియు 800సీసీ ఇంజన్‌లకు త్వరలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేయనుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2016, 15:00 [IST]
English summary
Kwid Continues Its Winning Streak For The French Automaker
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+