రెనో క్విడ్ ఏఎమ్‌టి విడుదల: ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు
రెనో ఇండియా ఆటోమేటిక్ వేరియంట్లో తమ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. సాధారణ గేర్ రాడ్ స్థానంలో షిఫ్ట్ గేర్ కంట్రోల్ ఏఎమ్‌టి డయల్ ను ప్రవేశ పెట్టడం సెగ్మెంట్లో మొదటి సారి.
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో చివరికి దేశీయ మార్కెట్లోకి తమ క్విడ్ ను ఆటోమేటిక్ వేరియంట్లో విడుదల చేసింది. గత ఏడాదిలో విడుదలైన క్విడ్ ను ఆటోమేటిక్ వేరియంట్లో 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. క్విడ్ ఏఎమ్‌టి ధర రూ. 4.25 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10 ఆటోమేటిక్ మోడల్‌కు గట్టి పోటీగా ఉండనుంది.

ప్రస్తుతం రెనో కంపెనీకు అత్యధిక అమ్మకాలు సాధించిపెడుతున్న ఉత్పత్తుల్లో క్విడ్ మొదటి స్థానంలో ఉంది. రెనో ఇప్పటికే లక్షకు పైగా క్విడ్ విక్రయాలు జరిపింది. గతంలో ఈ క్విడ్ ను శక్తివంతమైన 1.0-లీటర్ ఇంజన్‌తో కూడా విడుదల చేసింది.

రెనో ఈ క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల టాప్ ఎండ్ వేరియంట్ ఆర్ఎక్స్‌టిలో పరిచయం చేసింది. కాబట్టి సాధారణ క్విడ్ టాప్ ఎండ్ వేరియంట్ ధర (3.95 లక్షలు) కన్నా క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ (4.25 లక్షలు) ధర 30,000 రుపాయలు మాత్రమే అధికంగా ఉంది.

మ్యాన్యువల్ టాప్ ఎండ్ వేరియంట్‌కు క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్‌కు మధ్య ధర వ్యత్యాసం కేవలం 30,000 రుపాయలు మాత్రమే ఉండటం వలన అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

క్విడ్ ఆటోమేటిక్ విడుదల వేదిక మీద రెనో ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ మాట్లాడుతూ, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఆటోమేటిక్ సాంకేతికతను కోరుకునే వారికి ఇది ఎంతగానో నచ్చుతుంది. మరియు దీని విడుదలతో రెనో కార్ల ఫోర్ట్‌ఫోలియో మరింత బలంగా తయారవుతున్నాం అని తెలిపాడు. రెనో కుటుంబంలోకి మరింత వచ్చి చేరే అవకాశం ఉందని తెలిపాడు.

విపరీతమైన ట్రాఫిక్‌తో కూడుకున్న ఇండియన్ రోడ్లకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లు తప్పనిసరిగా అవసరం. 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఈజీ-ఆర్ అనే గేర్‌బాక్స్‌ను రెనో తమ క్విడ్‌లో పరిచయం చేసింది.

సాంకేతికంగా రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్లో 999సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం ద్వారా లీటర్‌కు 24.04కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఇతర ఆటోమేటిక్ కార్లకు క్విడ్ ఏఎమ్‌టికి ఉన్న తేడా
సాధారణ ఆటోమేటిక్ కార్లలో గేర్ రాడ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే క్విడ్‌లో ఫ్యాన్ రెగ్యులేటర్ తరహాలో షిఫ్ట్ కంట్రోల్ డయల్ ఉంటుంది. దీనిని డ్యాష్ బోర్డ్ మీద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగంలో అందించారు. ఇందులో రివర్స్, న్యూట్రల్ మరియు డ్రైవ్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.

క్విడ్ ఏఎమ్‌టి 3,679ఎమ్ఎమ్ పొడవు, 1,579ఎమ్ఎమ్ వెడల్పు, 1,478ఎమఎమ్ ఎత్తు మరియు 2,422ఎమ్ఎమ్ వీల్ బేస్ కలదు. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ 180ఎమ్ఎమ్ గా ఉంది. క్విడ్‌లో 28 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

పెద్ద ఎస్‌యువిలు మరియు హ్యాచ్‌బ్యాక్‌లలో వచ్చే ఫీచర్లయిన తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటి మరియు శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్ ఇందులో కలవు.

భద్రత పరంగా ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, లోడ్ లిమిటర్స్ గల ప్రి టెన్షనర్లు ఇందులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో మొదటి సారిగా పరిచయమైన ఫీచర్ ఇది.

క్విడ్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆర్‌ఎక్స్‌టిలో మాత్రమే ఈ ఆటోమేటిక్ వేరియంట్ లభించును. క్విడ్ ఆటోమేటిక్ ఫియరీ రెడ్, ఐస్ కూల్ వైట్, మూన్ లైట్ సిల్వర్, ఔట్ బ్యాక్ బ్రాంజ్ మరియు ప్లాంట్ గ్రే వంటి రంగుల్లో లభించును.


Click it and Unblock the Notifications








