విడుదలకు ముందుగా క్విడ్ 1.0-లీ కు పరీక్షలు నిర్వహించిన రెనో

By Anil

రెనో ఇండియా గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌ను ప్రదర్శించింది. గత ఏడాది విడుదలైన క్విడ్ 800 సీసీ అంచనాలు మించి ఫలితాలను సాధించింది. ఇదే తరుణంలో రెనో ఇండియన్ మార్కెట్లోకి 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని దీన్ని ప్రేమించే వారు భారీ సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.

చెన్నైలో క్విడ్ 1.0-లీటర్ కు పరీక్షలు


ప్రస్తుతం విడుదలకు నోచుకోనున్న 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌ను ఈజీ-ఆర్ అనే బ్యాడ్జి పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మధ్య కాలంలో భారతీయులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిని అస్త్రంగా చేసుకుని ఏఎమ్‌టిని ఈ నయా క్విడ్‌లో అందివ్వనున్నారు.

ఇది మార్కెట్లోకి విడుదల అయితే ఈజీ-ఆర్ ట్రిమే వేరియంట్ ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10 ఆటోమేటిక్ మోడల్‌తో పోటాపోటీగా ఉండనుంది. క్విడ్ మరియు కె10 రెండు వేరియంట్లు కూడా భారీ అమ్మకాలు సాధిస్తున్నాయి.
Also Read: ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శను చదవండి
ఫ్రెంచ్ ఆధారిత కార్ల తయారీ సంస్థ రెనో తమ క్విడ్ 1.0-లీటర్ ఆటోమేటిక్‌‌లో గేర్‌ లీవర్‌ను పూర్తిగా తొలగించి వేస్తోంది. ఈ స్థానంలో స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్ (ఎస్‌సిఇ) ను ప్రవేశపెడుతోంది. ఇందులో మూడు రకాల డ్రైవ్‌ మోడ్‌లు ఉంటాయి. వీటిలో డ్రైవ్, న్యూట్రల్ మరియు రివర్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎంచుకోవడం ద్వారా కారు నడపవచ్చు.

Article Published On: Tuesday, May 3, 2016, 12:03 [IST]
English summary
Renault Kwid AMT Caught Testing In Chennai Ahead Of Launch
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+