రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులతో సిద్దమై రెనో ఇండియా
రెనో ఇండియా గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన అత్యంత సరసమైన ఎంట్రీలెవల్ హ్యా్చ్‌బ్యాక్ విజయవంతం కావడంతో రెనొ ఇండియా గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద క్విడ్ పేరుతో క్విడ్ శ్రేణి వాహనాలయిన క్విడ్ క్లింబర్ మరియు క్విడ్ రేసర్ అనే రెండు సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. అయితే ఈ రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను కూడా 2017 నాటికల్లా దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

ఇవి రెండు కూడా ప్రత్యేక ధర మరియు లిమిటెడ్ ఎడిషన్‌గానే అందుబాటులోకి రానున్నాయి అని సమాచారం. అయితే రెనో ఇండియా మాత్రం దీనిని ఖచ్చితంగా ఏ తేదీన విడుదల చేస్తారో అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు

క్విడ్ పేరుతో ఉన్న క్లింబర్ చూడటానికి పూర్తిగా ఆఫ్-రోడ్ వాహనంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఆఫ్-రోడ్ కోసం పెద్ద మరియు అధిక పటిష్టం ఉన్న టైర్లను అందిస్తున్నారు.

రెనో క్విడ్ క్లింబర్ ఓవరాల్ డిజైన్ పరంగా చూస్తే అర్బన్ క్రాసోవర్ మోడల్స్‌ను పోలి ఉంటుంది.

రెనో క్విడ్ రేసర్ డిజైన్ పరంగా చూస్తే దీనిని పూర్తిగా రేసింగ్ కోసం అన్నట్లుగా డిజైన్ చేశారు. ముందు వైపున తక్కువ ప్రొఫైల్ స్టేన్స్ తో డిజైన్ చేశారు. క్లిబర్‌తో పోల్చితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగానే ఉంటుంది.

రెనో ఇండియా క్విడ్ క్లింబర్ మరియు క్విడ్ రేసర్ రెండింటిలో కూడా 1.0 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ రెండు మోడళ్లలో కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

రెనో క్విడ్ క్లింబర్

రెనో క్విడ్ రేసర్

డాట్సన్ గో క్రాస్ విడుదల వివరాలు
ప్రియస్ ఇండియాలో విడుదల తేదీని ఖరారు చేసిన టయోటా మోటార్స్


Click it and Unblock the Notifications








