ఆ విషయం పరంగా చూస్తే క్విడ్ మంచిది కాదా....!!
గ్లోబల్ న్యూ కార్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్ వారి ఆధ్వర్యంలో కొన్ని ఇండియన్ కార్లు పరీక్షలు చేయించుకున్నాయి (క్రాష్ టెస్ట్). అందులో సుమారుగా ఏడు భారతీయ కార్ల క్రాష్ పరీక్షలకు గురైనట్లు తెలిసింది. అయితే ఈ కార్లలో ప్రస్తుతం భారతీయ ఎంట్రీలెవల్ కార్ల మార్కెట్‌ను శాసిస్తున్న రెనో వారి క్విడ్ ఉన్నట్లు సమాచారం. మరో విశయం ఏంటంటే రెనో క్విడ్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఊహించిన ఫలితాలు రాలేదని వెల్లడైంది. బెస్ట్ సెల్లింగ్ రెనో క్విడ్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

రెనో క్విడ్ కారుకు అంతర్జాతీయ ఎన్‌సిఎపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) వారు నిర్వహించిన క్రాష్ పరీక్షలు తక్కువ మార్కులు స్కోర్ చేసింది. భద్రత పరంగా తక్కువ మార్కులను పొందింది.

ఎన్సిఎపి వారు ఇచ్చిన మార్కులను రెనో స్వీకరించింది. అయితే దీనిని భద్రత పరీక్షల నిమిత్తం కోసం అన్నట్లుగా మరింత పటిష్టమైన డిజైన్ అందివ్వడానికి రెనో ఇంజనీర్లు సిద్దం అవుతున్నారు.

ఈ రెనో క్విడ్‌కు నిర్వహించిన పరీక్షలకు సంభందించిన పూర్తి వివరాలు మరియు వీడియోలను ఎన్‌సిఎపి ఈ నెల 17 న రెనో సంస్థకు అందివ్వనుంది.

ఎన్సిఎపి వారి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలకు వచ్చిన ఏడు వాహనాలకు కూడా ప్రయాణికుల భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్లు పరీక్షలు జరపబడ్డాయి.

ప్రస్తుతం దేశీయంగా మంచి అమ్మకాలు సాధించే మరియు తాజాగా విడుదల కానున్న ఉత్పత్తులకు ఎన్‌సిఎపి భద్రతకు సంభందించి క్రాష్ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే డాట్సన్ సంస్థ వారి గో హ్యాచ్‌బ్యాక్ కారు భద్రత పరంగా మంచిది కాదని ఎన్‌సిఎపి ఓ ప్రకటనలో వెల్లడించింది.

దేశీయంగా అందుబాటులోకి వచ్చిన రెనో వారి క్విడ్ కారు ఇండియన్ మార్కెట్లోనే కాకుండా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా విడుదల కానుంది. రెనో ఇండియా త్వరలో దీనిని బ్రెజిల్ మార్కెట్లోకి
అందుబాటులోకి తీసుకురానుంది.

బ్రెజిల్ దేశానికి ఎగుమతి కానున్న క్విడ్‌లో మెరుగైన భద్రత ప్రమాణాలు కల్పిస్తున్నట్లు తెలిసింది.

పాత ఇన్నోవాకి కొత్త ఇన్నోవాకి మధ్య తేడా ఏంటి...?
సంభరంలో రెనో క్విడ్, భాదపడుతున్న మారుతి ఆల్టో


Click it and Unblock the Notifications