85,000 బుకింగ్స్‌తో దూసుకుపోతున్న రెనో క్విడ్ కారు
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో భారతీయ మార్కెట్లోకి గత ఏడాది తమ అత్యంత సరసమైన ఉత్తత్పిగా క్విడ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఇది అనూహ్యమైన ప్రజాదరణ పొందుతూ వస్తోంది. ఎంతగా అంటే ఏకంగా 85,000 బుకింగ్స్ నమోదు అయ్యాయి.

దేశ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న కార్లలో రెనో క్విడ్ ఒకటిగా నిలిచిపోయింది. 2015 సెప్టెంబర్‌లో విడుదల అయిన ఈ రెనో కారు కేవలం ఏడు రోజులలో దాదాపుగా 25,000 బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. ఈ అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును బుక్ చేసుకున్న వారికి వెయిటింగ్ పీరియడ్ ఇంకా ఉంది.
Also Read: రెనొ క్విడ్ వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్
2016 సంవత్సరం ప్రారంభంలో రెనో ఇండియా క్విడ్ వేరియంట్ల మీద దాదాపుగా 11,000 రుపాయల వరకు ధరల పెంపును ప్రకటించింది. ప్రస్తుతం క్విడ్ ప్రారంభ వేరియంట్ ధర రూ . 2.70 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.71 లక్షలు ఎక్స్ షో రూమ్ ముంబాయ్‌గా ఉన్నాయి.
Also Read: క్విడ్ మీద ధరలు పెంచిన రెనో ఇండియా
ప్రస్తుతం రెనో వారి క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారు దేశీయమార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, డాట్సన్ గో మరియు టాటా నానో జెన్‌ఎక్స్ వంటి కార్లకు పోటిగా నిలిచింది. త్వరలో ఈ క్విడ్ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అందించనున్నారు.


Click it and Unblock the Notifications