100,000 పైబడి అమ్మకాలు సాధించిన రెనో క్విడ్
రెనో క్విడ్ విడుదలయిన సమయం నుండి ఇప్పటి వరకు జరిపిన విక్రయాల్లో లక్ష అమ్మకాల మైలురాయిని చేదించింది. ఈ మైలురాయిని సాధించడంలో క్విడ్‌లోని రెండు వేరియంట్లు కీలక పోత్ర పోషించాయి.
రెనో సుమారుగా ఏడాది క్రితం తమ క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఫ్రెంచ్‌కు చెందిన ఈ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో 10,000 యూనిట్ల క్విడ్ విక్రయాలు జరిపి సరికొత్త మైలురాయిని సాధించింది. రెనో ఇండియా జనవరి 2016 నుండి ఆగష్టు వరకు 65,000 యూనిట్ల క్విడ్ కార్లను విక్రయించింది.

ప్రస్తుతం రెనో ఇండియా క్విడ్ ను రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అవి, క్విడ్ 800సీసీ మరియు క్విడ్ 1,000సీసీ పెట్రోల్ సామర్థ్యంతో ఉన్నాయి. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఉన్నాయి.

అయితే రెనో ఇండియా తాజాగ తమ క్విడ్ 1.0-లీటర్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పరిచయం చేసింది. ఒక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 0.8 లీటర్, 1.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండటం ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

రెనో ఇండియా క్విడ్ ద్వారా ప్రారంభించిన తమ విజయపు ప్రస్థానాన్ని అలాగే కొనసాగించడానికి ఇక మీదట ప్రతి ఏడాది క్విడ్ పేరుతో నూతన వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమచారం.

అతి త్వరలో రెనో ఇండియా క్విడ్ ను రెండు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లో పరిచయం చేయడానికి సిద్దమవుతోంది. ఆ రెండు ఉత్పత్తులను క్విడ్ క్లింబర్ మరియు క్విడ్ రేసర్ అనే పేర్లతో గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

రెనో ఇండియా తమ పోర్ట్‌ఫోలియోలో విసృతమైన ఫోర్ వీలర్లను అందిస్తోంది. అందులో క్విడ్ , పల్స్, స్కాలా, లాజీ మరియు డస్టర్ వంటి ఉన్నాయి. త్వరలో మరిన్ని ఉత్పత్తులు విడుదల కానున్నాయి.

- క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు
- ఇగ్నిస్ గురించి గుడ్ న్యూస్
- వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్


Click it and Unblock the Notifications








