రెనో క్విడ్ బుకింగ్ చేసుకున్న వారికి కాస్త ఉపశమనం
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో వారి అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్ క్విడ్. ఇప్పుడు దీని మీద ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలని రెనో ఇండియా నిర్ణయం తీసుకుంది. అవుడు ప్రస్తుతం క్విడ్ మీదున్న మూడు నెలల వెయిటింగ్ పీరియడ్‌ను ఒక్క నెలకు పరిమితం చేశారు.
రెనో ఇండియా దేశీయ మార్కెట్లో సుమారుగా 70,000 యూనిట్ల అమ్మకాలు జరిపింది. దీనిని రెనో సెప్టెంబర్ 2015 లో విడుదల చేసింది.

మీడియా ప్రతినిధులతో రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, ఈ ఏడాదిలోని క్యాలెండర్ తొలి సగం భాగంలో (జనవరి నుండి జూన్) మంచి అమ్మాకాలు నమోదయ్యాయి. ఏకంగా 62,000 యూనిట్ల అమ్మకాలు చేపట్టాము. తరువాత జూలై ఒక్క నెలలోనే 12,000 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అనగా మొత్తం 74,000 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఇది తమకు అతి పెద్ద మైలు రాయిని తెలిపారు.
ప్రస్తుతం రెనో క్విడ్‌లో 799సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.
Also Read: యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
ప్రస్తుతం రెనో ఇండియా 1.0-లీటర్ క్విడ్ మరియు దీనికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో దీనిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








