ఇండియాలో లాజీ మీద లక్ష రుపాయలు ధర తగ్గించిన రెనో
రెనో ఇండియన్ మార్కెట్లోకి టయోటా ఇన్నోవా ఎమ్‌పివి వాహనానికి పోటీగా లాజీని పరిచయం చేసింది. దేశీయ మార్కెట్లో ఇన్నోవా అడుగులు చాలా దూరం పాటు పరుచుకున్నాయి. ఎలాగైనా ఇన్నోవా అమ్మకాల్లోని వాటాను సొంతం చేసుకోవాలని ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ రెనో లాజీని పరిచయం చేసింది. అయితే ప్రజల్లో ఇన్నోవా మీదున్న గుర్తింపును తుడిచివేయలేకపోయింది.

రెనో వారి లాజీ విడుదలప్పటి నుండి ఇప్పటి వరకు నిలకడనైన అమ్మకాలు సాధించలేకపోతోంది. ఆఫర్లు ప్రకటించిన సమయంలో మాత్రం ఆశించిన అమ్మకాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెనో తమ లాజీ ఎమ్‌పివి మీద ఇండియాలో అమ్మకాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా లక్ష వరకు తగ్గించినట్లు రెనో ప్రకటించింది.

రెనో లాజి లో 15 లీటర్ సామర్థ్యం ఉన్న రెండు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఒక ఇంజన్ 83.84 బిహెచ్‌పి పవర్ మరియు 108.50 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

83.84 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 108.50 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

రెనో లాజి పునరుద్దరించబడిన ధరలు
- రెనో లాజి 83.84బిహెచ్‌పి ఎస్‌టిడి వేరియంట్ ధర రూ. 7.59 లక్షలు (తగ్గింపు సుమారుగా రూ. 96,000 లు)
- రెనో లాజి 83.84బిహెచ్‌పి ఆర్ఎక్స్ఇ వేరియంట్ ధర రూ. 8.57 లక్షలు (తగ్గింపు సుమారుగా రూ. 80,000 లు)
- రెనో లాజి 83.84బిహెచ్‌పి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ధర రూ. 9.44 లక్షలు (తగ్గింపు సుమారుగా రూ. 55,000 లు)
- రెనో లాజి 83.84బిహెచ్‌పి ఆర్ఎక్స్‌జడ్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలు (తగ్గింపు సుమారుగా రూ. 34,000 లు)
- అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్

రెనో లాజి పునరుద్దరించబడిన ధరలు



Click it and Unblock the Notifications