లాజీ స్టెప్‌వే ని విడుదల చేసిన రెనో: ప్రారంభ ధర రూ. 9.43 లక్షలు
రెనో ఇండియా దేశీయంగా ఉన్న తమ లైనప్‌లోనికి నూతన శ్రేణిలో స్టెప్‌వే లాజీ వేరియంట్లను విడుదల చేసింది. 16 కొత్త ఫీచర్ల జోడింపుతో తమ వేరియంట్లను మరింత అభివృద్ది చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.
రెనో ఇండియా తమ లైనప్‌లో ఉన్న లాజీ మోడల్‌కు 16 అదనపు ఫీచర్లను జోడించి నూతన వేరియంట్లుగా లాజీ స్టెప్‌వే పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త లాజీ స్టెప్‌వే ఏడు మరియు ఎనిమిది సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి.

రెనో లాజీ స్టెప్‌వే వేరియంట్ల వారీగా ధరలు
- రెనో లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్ఎల్ 85పిఎస్ 8-సీటర్ ధర రూ. 9.44 లక్షలు
- రెనో లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్ఎల్ 110పిఎస్ 8-సీటర్ ధర రూ. 10.10 లక్షలు
- రెనో లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్‌జడ్ 85పిఎస్ 8-సీటర్ ధర రూ. 10.18 లక్షలు
- రెనో లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్‌జడ్110పిఎస్ 8-సీటర్ ధర రూ. 10.97 లక్షలు
- రెనో లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్‌జడ్ 110పిఎస్ 7-సీటర్ ధర రూ. 11.27 లక్షలు గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
- నోట్ బ్యాన్ ఎఫెక్ట్: మహీంద్రా ఉత్పత్తులపై 2.71 లక్షల వరకు ఆఫర్లు
- 2017 లో విడుదలకు సిద్దమైన బైకుల జాబితా మరియు వాటి పూర్తి వివరాల కోసం....
- ఇండియా విడుదలకు సిద్దమవుతున్న కవాసకి డబ్ల్యూ800 క్లాసిక్


నూతన శ్రేణి రెనో లాజీ స్టెప్‌వే వేరియంట్లు ఆరు విభిన్న రంగుల్లో లభించనున్నాయి. అవి, పియర్ల్ వైట్, మూన్ లైట్ సిల్వర్, ప్లానెట్ గ్రే, రాయల్ ఆర్చిడ్, స్లేట్ గ్రే మరియు ఫిరి రెడ్ వంటి రంగులున్నాయి.

ఫీచర్ల పరంగా ఇందులో అడ్వాన్స్‌డ్ 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ మీడియానవ్ కన్సోల్ కలదు. ఈ కన్సోల్ నందు రియర్ పార్కింగ్ సెన్సార్లు, సులభతరమైన పార్కింగ్ కోసం కెమెరా కలవు.

రెనో ఇండియా ఈ రెనో స్టెప్‌వే వేరియంట్ల మీద 3కేర్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. 3కేర్ అనగా, మూడేళ్ల వారంటీ, మూడేళ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు మూడేళ్ల పాటు ఉచిత పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ ఉచితం.

లాజీ స్టెప్‌వే సరికొత్త వేరియంట్లలో నూతన ఫీచర్ల జోడింపుతో పాటు డిజైన్ పంరగా కొన్ని మార్పులు చేసింది. ఆభరణాలను తొడిగిన తీరులో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, 16-అంగుళాల ఆకర్షణీయమైన మెటల్ అల్లాయ్ చక్రాలు, రూఫ్ రెయిల్ మీద డార్క్ మెటల్ ఫినిషింగ్ అదే విదంగా ప్రక్కవైపున ఆర్చ్ క్లాడింగ్ సొబగులు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications








