25 విశిష్ట ఫీచర్లతో వరల్డ్ ఎడిషన్ లాజీని విడుదల చేసిన రెనో
రెనో ఇండియా దేశీయంగా స్పెషల్ ఎడిషన్ పేరుతో సరికొత్త లాజీని విడుదల చేసింది. ఇప్పుడు రెనో లాజీ ఎమ్‌పివి వాహనం వరల్డ్ ఎడిషన్‌గా అందుబాటులోకి వచ్చింది. సుమారుగా 25 అతి ముఖ్యమైన ఫీచర్లతో వాటికి తగ్గ ధరతో లాజీ వరల్డ్ ఎడిషన్ విడుదలైంది.

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం రెనో దేశీయంగా అందుబాటులోకి తెచ్చిన లాజీ వరల్డ్ ఎడిషన్ 85 పిఎస్ మరియు 110పిఎస్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వచ్చింది.

లాజీ వరల్డ్ ఎడిషన్‍లో 85పిఎస్ ఉత్పత్తి చేసే ఇంజన్ గల లాజీ ధర రూ. 9.74 లక్షలు మరియు 110పిఎస్ పవర్ ఉత్పత్తి చేయగల లాజీ ధర రూ. 10.40 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

లాజీ వరల్డ్ ఎడిషన్‌లోని నూతన ఫీచర్లు
- క్రోమ్ పదార్థపు ఆభరాణలతో నిండిన ఫ్రంట్ గ్రిల్
- బాడీ కలర్స్‌తో ఉన్న బంపర్లు మరియు క్రోమ్ అప్పర్ గ్రిల్ మోల్డింగ్
- చుట్టూ క్రోమ్ పూత పూయబడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
- ముందు మరియు వైనుక వైపున ఉన్న వీల్ క్లాడింగ్
- ముందు మరియు వెనుక వైపున స్కిడ్ ప్లేట్లు
- జెట్ బ్లాక్ ఫినిషింగ్‌తో ఉన్న ప్రక్కవైపు గుమ్మములు
- క్రోమ్ ఫినిషింగ్‌తో ఉన్న డ్యూయల్ టోన్ రూఫ్ రెయిల్
- క్రోమ్ స్ట్రిప్ గల బ్యాక్ డోర్ సైడ్ క్లాడింగ్
- ఆర్15 నెప్టా ఫినిష్ అల్లాయ్ వీల్స్
- ప్రక్క మరియు వెనుక వైపు డీకాల్స్ మీద వరల్డ్ ఎడిషన్‌ను సూచించే గుర్తులు
- ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అద్దాలు
- క్రోమ్ ఫినిష్ సెంటర్ ట్రిమ్‌లు గల డ్యాష్ బోర్డ్
- ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
- ఆరేంజ్ రంగు పూతలద్దిన లాజీ డోర్ మ్యాట్లు
- రెనో గుమ్మం ప్లేట్లు (డోర్ తెరిచినపుడు కనబడే గుమ్మము)
- కారులోని బి మరియు సి పిల్లర్స్ ఉపరితలం మీద ప్రింట్ మట్టీ గల స్ట్రిప్‌ను అందించారు.



సరికొత్త ఆరేంజ్ ఫినిష్ ఎయిర్ వెంట్‌లు
డోర్ ట్రిమ్స్ మీద క్లాసిక్ మోనోటోన్ కలర్స్
ఆరేంజ్ రంగుల్లో ఉన్న ఇంటీరియర్ మెటల్స్ మరియు
ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే, ఫ్యాబ్రిక్ సీట్లు

డ్యూయల్ టోన్ రంగుల్లో వరల్జ్ ఎడిషన్ గల గ్లోసీ బ్లాక్ మంచు రంగులో ఉన్న స్టీరింగ్ వీల్
స్టైలిష్ వినైల్ గేర్ షిఫ్ట్
క్రోమ్ పార్కింగ్ బ్రేక్ లీవర్ బటన్
ఇన్ సైడ్ క్రోమ్ డోర్ హ్యాండిల్


ఎనిమిదేళ్లు, 34 అవార్డులు, 10 లక్షల అమ్మకాలు: హ్యుందాయ్ ఐ20


Click it and Unblock the Notifications








