దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత
రెనో మరియు నిస్సాన్ రెండు సంస్థలు భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు చురుకుగా సాగిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా ఈ రెండు సంస్థలు విదేశీయాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు దిగ్గజాలు జపాన్‌కు చెందిన మిత్సుబిషికి కాస్త తోడ్పాటును అందివ్వనున్నాయి.

ప్రస్తుతం రెనో-నిస్సాన్ భాగస్వామ్యానికి ముఖ్య కార్యనిర్వహణా అధికారిగా భాద్యతలు నిర్వర్తిస్తున్న కార్లోస్( Carlos Ghosn) మాట్లాడుతూ తమ వేదిక మీద మిత్సుబిషికి స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించాడు.

రెనో, నిస్సాన్ మరియు మిత్సుబిషి మూడు సంస్థలు కూడా విభిన్న ఆసక్తికరమైన ఉత్పత్తులను దేశీయంగా అందివ్వడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం రెనో-నిస్సాన్ సంస్థలు కాంపాక్ట్ ఎస్‌యువిల అభివృద్దికి ఉపయోగిస్తున్న సిఎమ్ఎప్-బి ఫ్లాట్‌ఫామ్‌ను మొదటి సారి మిత్సుబిషి కూడా వినియోగించుకోనుంది.

సిఎమ్ఎఫ్-బి వేదిక మీద అభివృద్ది పరచబడిన ఎస్‌యువిలకు మంచి ఉదాహరణ రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో అని చెప్పవచ్చు.

రెనో మరియు నిస్సాన్ సంయుక్తంగా అభివృద్ది చేసిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లను మిత్సుబిషి సేకరించి నూతన ఉత్పత్తులను అభివృద్ది చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి మిత్సుబిషి తమ మొదటి సబ్ నాలుగు మీటర్ల పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యువిని అభివృద్ది చేయనుంది.

సబ్ నాలుగు మీటర్ల పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యువిని మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాలను పొందుతుంది.

రెనో-నిస్సాన్ భాగస్వామ్యంతో మిత్సుబిషి అభివృద్ది చేస్తున్న మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

మిత్సుబిషి విడుదల చేసే తమ మొదటి ఎస్‌యువి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

దేశీయ మార్కెట్లో మూడు దిగ్గజ సంస్థల పరస్పర ఒప్పందంతో ముందుకు నడవడం భారతీయ వాహన పరిశ్రమలో చారిత్రాత్మకం అని చెప్పాలి. అయితే ఈ మూడు సంస్థల సమిష్టిగా అభివృద్ది చేసే అందుబాటులోకి తెచ్చే ఉత్పత్తి మీద భారీ అంచనాలే ఉన్నాయి.

- సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు
- సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన కవాసకి: ధర మరియు ఇతర వివరాలు


Click it and Unblock the Notifications








