10,00,000 మైక్రా కార్లను తయారు చేసిన రెనో నిస్సాన్
నిస్సాన్ మరియు రెనో వారి భాగస్వామ్యంత రూపొందించబడిన కారు మైక్రా. ఇది ప్రస్తుతం మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. ఎందుకంటే 10,00,000 వ మైక్రా కారును తమ ఆర్గాడామ్ చెన్నై ప్లాంటులో తయారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. సరిగ్గా 12:15 గంటలకు శుక్రవారం, జనవరి 8, 2016 న ఈ 10,00,000 వ కారును విడుదల చేశారు.

రెనో మరియు నిస్సాన్ వారి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన అతి పెద్ద కార్ల ఉత్పతి కేంద్రంగా పేరు గాంచింది. మార్చి 2010 న దాదాపుగా 45 బిలియన్ రుపాయలను ప్రారంభ పెట్టుబడిగా పెట్టారు. ఇప్పటి వరకు రెనో, నిస్సాన్ మరియు డాట్సన్ ల వారి దాదాపుగా 32 మోడళ్ల కార్ల ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది.
ప్రతి ఏడాది కూడా ఈ మూడు సంస్థల నుండి రెండు కొత్త మోడళ్లు ఉత్తత్తికి వెళ్తున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యధికంగా కార్లను ఎగుమతి చేస్తున్న వాటిలో ఈ ప్లాంటు రెండవ స్థానంలో కలదు. 2010 నుండి దాదాపుగా 106 దేశాలకు 600,000 వరకు కార్లను ఎగుమతి చేస్తోంది .


Click it and Unblock the Notifications













