లీటర్‌కు వంద కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగల కారుని ప్రదర్శించిన రెనో
ఈ కాలంలో కనీసం టూ వీలర్ కూడా లీటర్‌కు 100 కిలోమీటర్లు ఇవ్వలేవు, అలాంటి ఏకంగా తమ కారు లీటర్‌కు 100 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇస్తుంది. క్రితం రోజు ఆటో ఎక్స్ పో సందర్శనలో ప్రకటించింది. రెనో ఇండియా 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఇయోలాబ్ అనే కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఇంత మైలేజ్ ఇచ్చే కారు మాదే అంటూ సందర్శకులను విపరీత స్థాయిలో ఆకట్టుకుంది.

రెనో ఇండియా ప్రదర్శించిన ఇయోలాబ్ కాన్సెప్ట్ కారుకు చెందిన చిత్రమాళికలు:
ఇంజన్ మరియు గేర్ బాక్స్:
రెనో ఇండియా వారి ఇయోలాబ్ కారు 1-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 75 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 53 బిహెచ్‌పి పవర్‍ని ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్‌తో క్లచ్ వద్ద అనుసంధానమై ఉంటుంది.
ఇంత మైలేజ్ ఇవ్వడానికి కారణం :
ఇందులో రెనో రెండు ఇంజన్‌లను అమర్చింది. కారు మొదటి మరియు రెండవ గేర్లలో ఉన్నపుడు ఎలక్ట్రిక్ ఇంజన్ పవర్‌ను చక్రాలకు అందిస్తుంది. కారు వేగం పుంజుకున్న పిమ్మట మూడు మరియు ఆపైన గల గేరులో నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా పెట్రోల్ ఇంజన్ స్టార్ట్ అయ్యి పవర్‌ను చక్రాలకు అందిస్తుంది. అయితే పెట్రోల్ ఇంజన్ ఆన్‌లో ఉన్నపుడు విధ్యుత్ మోటార్ ఆగిపోతుంది.
Also Read: లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల టయోటా వారి ప్రియస్ కారు.
డిజైన్:
రెనో వారి ఇయోలాబ్ కారు ఇంత మైలేజ్ ఇవ్వడానికి కారణం దీని ఇంజన్ మాత్రమే కాదు, దీని డిజైన్ కూడా ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. గాలి నుండి కలిగే ఘర్షణను తగ్గించడానికి దీనిని ఏరోడైనమిక్‌గా డిజైన్ చేశారు. పెట్రలో మరియు ఎలక్ట్రిక్ ద్వారా నడిచే ఈ హైబ్రిడ్ కారులో చాలా వరకు విడిభాగాలను తక్కువ బరువు ఉండేవిధంగా తయారు చేశారు.
Also Read: మారుతి సుజుకి వితారా బ్రిజా కారు విడుదల వివరాలు మరియు ఫోటోలు
అందుబాటులోకి :
ఈ కారును ప్రస్తుతం ఇంకా అభివృద్ది చేస్తున్నారు. రెనో దీనిని 2022 నుండి ఉత్పత్తి తయారు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కారుకు ఎటువంటి కార్లు కూడా పోటికిగా వచ్చే అవకాశం లేదు. అయితే టయోటా ప్రియస్ కారు దీనికి ఒక విధంగా పోటికి రావచ్చు. ఎందుకంటే ప్రియస్ లీటర్‌కు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ని ఇస్తుంది.


Click it and Unblock the Notifications

























