సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

గరిష్ట ఎత్తు సముద్ర మట్టానికి సుమారుగా 13,050 అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సును ప్రయోగాత్మకంగా నడిపిన భారత దేశపు మొదటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.

By Anil

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రవాణా శాఖ ఒక కొత్త మైలు రాయిని ఛేదించింది. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న రోహ్తంగ్ పాస్ వద్ద ఎలక్ట్రిక్ బస్సుకు విజయవంతంగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించింది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

అన్ని అంశాల పరంగా ఈ ఎలక్ట్రిక్ బస్సు విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకున్నా, గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో నెగ్గలేకపోయింది. మిట్ట మరియు వాలు తలాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో తిరిగే వాహనాలకు గ్రౌండ్ క్లియరెన్స్ అధికంగా ఉండాలి. అయితే ఇందులో కావాల్సిన స్థాయిలో లేదు.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

గ్రౌండ్ క్లియరెన్స్ అనగా: రోడ్డు తలం నుండి బస్సు యొక్క యాక్సిల్‌కు మధ్య ఉన్న దూరాన్ని ఆ వాహనం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

రెండు నుండు మూడు సంస్థల వరకు తమ ఉత్పత్తులను ఈ ప్రదేశంలో పరీక్షించడానికి త్వరలో రానున్నాయి. అయితే ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి, మృదువైన ప్రయాణాన్ని అందించే వాటి పట్ట హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సుముఖత చూపే అవకాశాలు ఉన్నాయి.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

వచ్చే ఏడాది వేసవి కాలానానికి మనాలి మరియు రోహ్తంగ్ మధ్య ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

సముద్ర మట్టానికి 13,050 అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు సేవలను అందిస్తున్న తొలి రాష్ట్రంగా నిలుస్తోంది. అయితే ఈ సేవలను ప్రారంభించడం అంత సులువేం కాదు, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

సాంకేతికంగా దీనిని మనాలి నుండి రొహ్తంగ్ వరకు 40 మంది ప్రయాణికులతో ప్రయోగించారు. ఇది సుమారుగా 50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినందుకు గాను బ్యాటరీ మొత్తంలో 28 నుండి 30 శాతం శక్తిని మాత్రమే వినియోగించుకుంది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వారి సూచనల మేరకు మనాలి మరియు రోహ్తంగ్ మధ్య రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించనున్నారు.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

మనాలి మరియు రోహ్తంగ్ మధ్య ప్రారంభం కానున్న ఈ ఎలక్ట్రిక్ సర్వీస్ ఆ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన మొట్ట మొదటి పర్యావరణహితమైన సర్వీస్‌గా నిలిచింది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

ప్రారంభంలో మనాలి మరియు రోహ్తంగ్ మధ్య సిఎన్‌జి తో నడిచే బస్సులను నడపాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సూచించింది. అయితే సిఎన్‌జి లభ్యత మరియు సరఫరా కాస్త కష్టం కావడం కారణంగా ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

ప్రస్తుతం 25 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలనే ప్రతిపాదన ఉంది. అయితే వీటి సంఖ్యను 50 కి పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం

మనాలి రోహ్తంగ్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల కోసం కేంద్ర 75 శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను సమకూర్చనున్నాయి.

సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం
  • ఒక్కసారి ఛార్జింగ్‌తో 966 కిలోమీటర్లు నడిచిన ఎలక్ట్రిక్ బస్సు
  • బెర్ముడా ట్రయాగింల్: విశ్వ రహస్యం బట్టబయలు

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2016, 10:54 [IST]
English summary
Read In Telugu: Himachal Pradesh became the first state in India to test electric bus at an altitude of 13,050 feet. The electric bus was tested from Manali to Rohtang Pass.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+