రూ. 2 కోట్లు ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

By Anil

భారత క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు ప్రయాణించి అలసిపోయి విశ్రాంతి తీసుకున్న సచిన్ టెండూల్కర్ తన బిఎమ్‌డబ్ల్యూ కార్ల గ్యారేజిలో పరిమితికి మించి ఉన్న కార్లకు మరో కొత్త 7-సిరీస్ కారును జోడించారు. ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూను అమితంగా ప్రేమించే సెలబ్రిటీలలో ఒకడైన సచిన్ 750 ఎలఐ ఎమ్-స్పోర్ట్ కారును కొనుగోలు చేశాడు.

క్రికెట్ దిగ్గజం ఎంచుకున్న సచిన్ టెండూల్కర్ ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఎమ్-స్పోర్ట్ కారు గురించి పూర్తి వివరాలు...

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

సచిన్ ఈ ఏడాదిలో ఇది వరకే బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేశాడు. ఈ ఏడాదిలో ప్రస్తుతం ఎంచుకున్న 7-సిరీస్ ఎమ్-స్పోర్ట్ కారు రెండవది. దీనిని తన అభిరుచికి తగ్గట్లుగా కస్టమైజ్ చేయించుకున్నాడు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

ఈ 7-సిరీస్ కారు ఎమ్-స్పోర్ట్ పేరుతో మరింత ప్యాకేజిని తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ముందు వైపున రీ డిజైన్ బంపర్, అధిక క్రోమ్ కలిగిన సరికొత్త స్పోర్టివ్ ఫ్రంట్ గ్రిల్. మరియు టెయిల్ ల్యాంప్స్ కలవు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

సచిన్ తన అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేయించుకున్న ఈ 7-సిరీస్ లో 20-అంగుళాల ఆంగ్లపు వి-ఆకారంలో ఉన్న స్పోక్స్, ప్రతి స్పోక్స్ మీద వ్యక్తిగతంగా బిఎమ్‌డబ్ల్యూ పేరు లిఖించబడి ఉంది. ఇల్లుమినేటెడ్ డోర్ల మీద మరియు వెనుక వైపున రెండు టెయిల్ లైట్లను కలుపుతూ ఉండే క్రోమ్ పట్టీ మీద అదే పేరును అందించారు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

కస్టమైజేషన్ సొగసులు ఎక్ట్సీరియర్ కన్నా ఎక్కువగా ఇంటీరియర్‌లో గమనించవచ్చు. ఇంటీరియర్‌లోని సీట్లను మరియు అప్ హోల్‌స్ట్రేని తెలుపు రంగులో ఉన్న లెథర్‌తో డిజైన్ చేశారు. మరియు సీట్ల మీద ఉన్న హెడ్ రెస్ట్ మీద సచిన్ లోగోని ప్రింట్ చేసారు. అచ్చం ఇలాంటి దానిని గతంలో సచిన్ ఎంచుకున్న 7-సిరీస్‌లో ప్రింట్ చేయించాడు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇందులో కస్టమైజ్ చేయించిన 5.0 ఐడ్రైవ్ డిజిటల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

ఇందులో రిమోట్ కంట్రోల్ పార్కింగ్ అసిస్ట్, గెస్చర్ కంట్రోల్, 3డీ గ్రాఫిక్స్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ లతో సమిష్టిగా హెడ్స్ అప్ డిస్ల్సే సిస్టమ్ కలదు. అంతే కాకుండా ఇందులో 7-అంగుళాల పరిమాణం గల ట్యాబ్లెట్‌ను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలదు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

సాంకేతికంగా ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 750ఎల్ఐ ఎమ్-స్పోర్ట్‌లో 4.7-లీటర్ సామర్థ్యం గల ట్విన్ పవర్ టుర్బో వి8 ఇంజన్ కలదు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 750ఎల్ఐ ఎమ్-స్పోర్ట్‌ లోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 450బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

ఎనిమిది సిలిండర్లు గల ఇందులోని పెట్రోల్ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 750ఎల్ఐ ఎమ్-స్పోర్ట్‌ కేవలం 4.7 సెంకడ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 750ఎల్ఐ ఎమ్-స్పోర్ట్‌ కారు ధర రూ. 1,89,82,901 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

  • సచిన్ టెండూల్కర్ వాహన ప్రపంచంలోని BMW కార్ కలెక్షన్
  • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు
  • 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెథర్

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2016, 18:09 [IST]
English summary
Read In Telugu: Sachin Tendulkar Gets New Bmw 7 Series Car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+