కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ వారికి ప్రతి ఎటా అత్యధిక అమ్మకాలు తెచ్చిపెట్టే స్కార్పియో వాహనాన్ని మరిన్ని హంగులతో తీర్చిదిద్ది అతి త్వరలో మన ముందుకు విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్యనే దీనిని ఎవరకీ తెలియకుండా రహస్యంగా పరీక్షలు జరిపారు. కాని దీనికి గురించి కొన్ని వివరాలు తెలసిపోయాయి.

మహీంద్రా స్కార్పియో గురించి మరన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త స్కారయో వాహనాన్ని రోడ్ల మీద పరీక్షిస్తుండగా ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఇందులో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎరుపు రంగులో గల బ్రేక్ కాలిపర్స్ మరియు స్పోర్టివ్ ఫీలింగ్‌ను ఇచ్చే ఎస్‌యువి బాడీని ఇది కలిగి ఉంది.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న సరికొత్త స్కార్పియోలో ముందు జనరేషన్ ఇంజన్‌ను వినియోగించనున్నారు. ముందు జనరేషన్ స్కార్పియోలో అందుబాటులో ఉన్న వేరియంట్లు ఎస్2, ఎస్4, ఎస్4 ప్లస్, ఎస్6 ప్లస్, ఎస్8, ఎస్10 మరియు ఎస్10 ఆటోమేటిక్

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

స్కార్పియో బేస్ వేరియంట్లో 75 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 2.5-లీటర్ ఇంజన్ కలదు. బేస్ వేరియంట్లో 2-వీల్ డ్రైవ్ కలదు.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

2.2-లీటర్ కెపాసిటి గల ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. మరియు 1.9-లీటర్ ఇంజన్ గల స్కార్పియో ఎస్‌యువిని కేవలం డిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా వారు 2002 లో విడుదల చేసిన స్కార్పియో ప్రస్తుత ధర దాదాపుగా రూ. 9.06 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. మరియు దీనిని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే వారు. యూరోపియన్ మార్కెట్లో దీనిని స్కార్పియో గోవా అని పిలిచేవారు.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో

అయితే అతి త్వరలో మార్కెట్లోకి రానున్న సరికొత్త స్కార్పియో ఎస్‌యువి టాటా సఫారి స్ట్రామ్, టాటా అరియా, రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మారుతి సుజుకి అతి మార్కెట్లోకి విడుదల చేయనున్న వితారా బ్రిజా ఎస్‌యువిలకు గట్టి పోటిని ఇవ్వనుంది.

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో
  • భారతదేశపు నెం.1 కారు: 30 లక్షలు అమ్మకాలు జరిపిన మారుతి ఆల్టో
  • ఆశ్చర్యం ! బజాజ్ వారి 150సీసీ కెపాసిటి గల వి మోడల్ బైకు ధర
  • 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు

ఫోటోలు

More from DriveSpark

Article Published On: Saturday, February 27, 2016, 17:42 [IST]
English summary
Scorpio Special Edition Spied
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+