స్కోడా ఆక్టావియా రీకాల్ : కారణం....
స్కోడాకు చెందిన సుమారుగా 539 ఆక్టావియా కార్లు రీకాల్‌గు గురయ్యాయి. మ్యాన్యువల్ చిల్డ్ లాక్‌లో లోపం కారణంగా ఆక్టావియా కార్లను వెనక్కి పిలిచినట్లు స్కోడా తెలిపింది.

స్కోడా ఇండియా వారి కథనం ప్రకారం, నవంబర్ 2015 మరియు ఏప్రిల్ 2016 మధ్యన ఉత్పత్తి అయిన ఆక్టావియా కార్లను రీకాల్ చేశారు, ఈ కార్లలో చిల్డ్ లాక్‌లను పరిశీలించి లోపం ఉన్న వాటిని మార్పు చేసి తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నారు.
Also Read: కొత్తగా వస్తున్న కియా దెబ్బకు మారుతి చతికిలపడాల్సిందేనా ?
పైన పేర్కొన్న సమయంలో ఉత్పత్తి అయిన వాటిని కొనుగోలు చేసిన వారి కార్లలో ఈ లోపాన్ని కేవలం 12 నిమిషాల్లో గుర్తించవచ్చు. లోపం ఉన్నట్లయితే సమీపంలోని స్కోడా డీలర్ సమస్యను క్లియర్ చేస్తారు. మరియు ఇది ఉచితంగా చేస్తున్నట్లు స్కోడా ప్రకటించింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న స్కోడా డీలర్లు కస్టమర్లకు ఈ విశయమై ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








