2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు సాంకేతిక వివరాల కోసం...

Written By:

సిజెక్ ఆధారిత దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియన్ మార్కెట్లోకి తమ 2016 ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. 2011 లో మొదటి ర్యాపిడ్‌ను ఇండియన్స్‌కు పరిచయం చేసింది స్కోడా.

స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.27 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.57 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.

స్కోడా ర్యాపిడ్ ఫే‌స్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధరలు

స్కోడా ర్యాపిడ్ ఫే‌స్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధరలు

 • స్కోడా ర్యాపిడ్ ఆక్టివ్ ధర రూ. 8,34,906 లు
 • స్కోడా ర్యాపిడ్ ఆంబిషన్ ధర రూ. 9,26,728 లు
 • స్కోడా ఆంబిషన్ ఆటోమేటిక్ ధర రూ. 10,38,841 లు
 • స్కోడా ర్యాపిడ్ స్టైల్ ధర రూ. 10,44,163 లు
 • స్కోడా ర్యాపిడ్ స్టైల్ ఆటోమేటిక్ ధర రూ. 11,46,187 లు
స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ వేరియంట్ ధరలు

స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ వేరియంట్ ధరలు

 • స్కోడా ర్యాపిడ్ ఆక్టివ్ ధర రూ. 9,57,335 లు
 • స్కోడా ర్యాపిడ్ ఆంబిషన్ ధర రూ. 10,49,157 లు
 • స్కోడా ర్యాపిడ్ ఆంబిషన్ ఆటోమేటిక్ ధర రూ. 11,71,471 లు
 • స్కోడా ర్యాపిడ్ స్టైల్ ధర రూ. 11,66,590 లు
 • స్కోడా ర్యాపిడ్ స్టైల్ ఆటోమేటిక్ ధర రూ. 12,78,590 లు
గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా ఇవ్వబడ్డాయి.
సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

సరికొత్త స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ అను రెండు ఇంధన ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మ్యాన్యువల్ షిప్టింగ్ ఆప్షన్లు కలవు. దీని ద్వారా ఇంజన్‌ నుండి ముందు చక్రాలకు పవర్ మరియు టార్క్ సరఫరా అవుతుంది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లీటర్‌కు 15.41 కిలోమీటర్ల మైలేజ్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లీటర్‌కు 14.84 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోచార్జ్‌డ్ డీజల్ ఇంజన్ సుమారుగా 108.6బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగలదు.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందించారు. దీని గుండా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ర్యాపిడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లీటర్‌కు 21.13 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లీటర్‌కు 21.72 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలవు.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

డిజైన్ పరంగా స్కోడా ర్యాపిడ్ బ్రాండ్ న్యూ ఫ్రంట్ గ్రిల్‌తో ఆకర్షణీయంగ తీర్చిదిద్దబడింది. దీని ఫ్రంట్ గ్రిల్ రూపకల్పన ఆక్టావియా మరియు సూపర్బ్ కన్నా పెద్ద పెద్ద నిలువు గీతలతో డిజైన్ చేయబడింది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న కోణీయ హెడ్ ల్యాంప్స్ మధ్యలో సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌ పొదిగి ఉంది. దీనికి క్రింది భాగంలో ఉన్న బంపర్ కూడా కోణీయాకృతిలో ఉంది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఇక వెనుక వైపు డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు, ప్రస్తుతం ఉన్న ర్యాపిడ్ తరహాలోనే ఉంది. అయితే ఎగ్జాస్ట్ పైపు కాస్త డిఫరెంట్‌గా ఉంది.

సరికొత్త 2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్న రంగుల్లో లభించును

సరికొత్త 2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్న రంగుల్లో లభించును

 • బ్రిలియంట్ సిల్వర్
 • క్యాండీ వైట్
 • క్యాప్సినో బీజి
 • కార్బన్ స్టీల్
 • సిల్క్ బ్లూ (పై ఫోటోలో ఉన్నది)
 • ఫ్లాష్ రెడ్
2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2016 స్కోడా ర్యాపిడ్ ఇంటీరియర్‌ మునుపటితో పోల్చుకుంటే మరింత సౌకర్యవంతంగా మరియు విలాసవంతంగా ఉంది. ఇంటీరియర్‌లోని అప్‌హోల్‌స్ట్రే గరిష్ట లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2016 స్కోడా ర్యాపిడ్ సెంటర్ కన్సోల్‌లో 6.5-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులోని మిర్రర్ లాక్ సిస్టమ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేతో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కలదు.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ర్యాపిడ్‌లో డ్యాష్ బోర్డ్ మీద, రాడ్‌ల మీద, వాతావరణ నియంత్రణ బటన్‌లను, ఎయిర్ వెంట్‌లను క్రోమ్ పదార్థంతో అలంకరించారు.

2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2016 స్కోడా ర్యాపిడ్ గరిష్ట భద్రత ఫీచర్లతో వచ్చింది. ఇందులో

 • విభిన్నమైన ఎయిర్ బ్యాగులు
 • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్,
 • హిల్ హోల్డ్ కంట్రోల్
 • ఆటోమేటిక్ డిమ్మింగ్ రివర్ వ్యూవ్ మిర్రర్
 • పార్కింగ్ సెన్సార్లు వంటివి కలవు.
2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2016 స్కోడా ర్యాపిడ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ వెంటో , హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి ఉత్పత్తులకు గట్టి పోటీగా నిలవనుంది.

 
Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: 2016 Skoda Rapid Launched In India; Prices Start At Rs. 8.34 Lakh
Story first published: Thursday, November 3, 2016, 17:46 [IST]
Please Wait while comments are loading...

Latest Photos