చింతించకండి...బుక్ చేసుకున్న మీ కార్లు అతి త్వరలో డెలివరీ కానున్నాయి.
గత ఏడాది నుండి అర్థభాగం నుండి కార్లను కొనగోలు చేస్తున్న వారు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా విభిన్ని నూతన మోడళ్లు భారీ స్థాయిలో మార్కెట్లోకి విడుదల అవుతూ వచ్చాయి. కాని వాటి బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికి ఇప్పటికీ చేరలేదు. కారణం డెలివరీ కాల పరిమితి పెరిగిపోతుండటం.
ఈ సందర్భంలో ప్రముఖ కార్ల సంస్థలు వనియోగదారులను దృష్టిలో ఉంచుకుని బుక్ చేసుకున్న వారి కార్లు అతి త్వరలో డెలివరీ ఇవ్వడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. ఇలా డెలివరీ కోసం అధిక కాలపరిమితి ప్రకటించిన కార్లు మరియు వాటి డెలివరీ వివరాల గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి బాలెనొ బుకింగ్
మారుతి సుజుకి వారు గత ఏడాదిలో విడుదల చేసిన బాలెనొ కారును ఇప్పటికే పోటిపడి ఎందో ఎంచుకున్నారు. ప్రస్తుతం దీనిని బుకింగ్ చేసుకున్న వారి సంఖ్య 80,000 గా ఉంది. దీనిని వలన ఈ కార్లు వినియోగదారులను చేరడానికి సుమారుగా ఆరు నెలల కాల పరిమితిని ప్రకటించింది. దీని వెయిటింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారులకు అందివ్వడానికి ఉత్పత్తి సామార్థ్యాన్ని పెంచింది .

పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
మారుతి సుజుకి సంస్థకు హర్యాణాలో గల మాన్సేర్ ప్లాంటు ద్వారా తమ విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తోంది . అయితే ఈ ప్లాంటు ద్వారా అధిక స్థాయిలో బాలొనొ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. తద్వారా వినియోగదారులకు అతి త్వరలో బాలెనొ కార్లను డెలివరీ ఇవ్వనున్నారు.

మహీంద్రా కెయువి100
మహీంద్రా వారు బడ్జెట్ ధరలో ప్రవేశ పెట్టిన మిని ఎస్‌యువి కెయువి100. దీనికి చెందిన బుకింగ్స్‌ను ప్రారంభించిన తరువాత వినియోగదారుల తాకిడికి మూడు నెలల వెయిటింగ్ సమయాన్ని ప్రకటించారు. వీటిని బుకింగ్ చేసుకున్న వారిలో 50 శాతం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గల వాటిని బుక్ చేసుకున్నారు

ఉత్పత్తి స్థాయి
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు మహరాష్ట్రలో గల ప్లాంటులో నెలకు 5,500 వరకు కెయువి100 ఎస్‌యువిలను ఉత్పత్తి చేస్తోంది. వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. అతి త్వరలో వీటిని వినియోగదారులకు డెలవరీ ఇవ్వనున్నారు.

రెనో క్విడ్
ఎంట్రీ లెవల్ బడ్జెట్ కార్లలలో చౌక ధరతో వచ్చిన రెనో క్విడ్ తనకు పోటిగా నిలిచిన మిగతా కార్ల నోర్లు మూయించిందని చెప్పవచ్చు. విడుదలైన అతి తక్కువ కాలంలోనే రెనో క్విడ్ దాదాపుగా లక్ష వరకు బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. అయితే చెన్నై వరదల కారణంగా చెన్నై ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోవడం ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వంటి కారణాల వలన ఇవి బుక్ చేసుకున్న వినియోగదారులకు చేరడానికి 10 నెలల వరకు సమయ పట్టనుంది. ఈ మధ్యనే రెనో ఆవిష్కరించిన 1.0-లీటర్ ఏఎమ్‌టికి కూడా ఇదే బాటలో నడవనుంది

పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
రెనో మరియు నిస్సాన్ వారి సంయుక్త చెన్నై ప్లాంటులో నెలకు 5,000 నుండి 6,000 వరకు ఉత్పత్తి జరుగుతోంది. అయితే వీటి ఉత్పత్తిని 8,000 నుండి 10,000 వరకు పెంచాలని నిర్ణయించింది. ఇలా జరిగితే ప్రస్తుతం ఉన్న కాలపరమితి సగానికి తగ్గే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి అతి తక్కువ కాలంలో విశేష ప్రజాదరణ పొందింది. ఎంతంటే దీనిని విడుదల చేసిన సమయం నుండి దాదాపుగా 75,000 మంది బుక్ చేసుకున్నారు. దీని సెగ్మెంట్లో ఉన్న ఇతర ఉత్పత్తులకు ఇది విపరీతమైన పోటిగా నిలిచింది అని చెప్పవచ్చు . క్రెటా కోసం వినియోగదారులు వేచి ఉండాల్సిన సమయం దాదాపుగా ఎనిమిది నెలలుగా ఉంది.

పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
ప్రస్తుతం హ్యుందాయ్ తన చెన్నై ప్లాంటులో ఈ క్రెటా కార్ల ఉత్పత్తి చేపట్టింది. హ్యుందాయ్ ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న సామర్థ్యాన్ని 10,000 వరకు పెంచనుంది తద్వారా వెయింట్ సమయం మూడు నెలలుగా ఉండనుంది. వీటిని దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బుకింగ్ చేసుకుంటున్నారు.

మహీంద్రా టియువి300
మహీంద్రా వారు ప్రవేశపెట్టిన ఏడు సీట్ల సామర్థ్యం గల నాలుగు మీటర్ల పొడవున్న ఎస్‌యువి టియువి300. మంచి డిమాండును పొందిన ఇందులో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ బాగా కలసి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీని వెయిటింగ్ సమయం 2 నెలలుగా ఉంది.

పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
మహీంద్రా అండ్ మహీంద్రా వారు ప్రస్తుతం ఈ టియువి వాహనాలను నెలకు 4,000 చొప్పున ఉత్పత్తి చేస్తున్నారు. మహీంద్రా వీటి ఉత్పత్తిని మరింత పెంచడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలిసింది. తద్వారా వినియోగదారుల కాలపరిమితి తగ్గి డెలివరీ వేగవంతంగా జరగనుంది.

- ప్రపంచంలో మొదటి కీ లెస్ ఎంట్రీ కారు "వోల్వో"
- ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య ప్రారంభం కానున్న యుద్దం...!!
- అమితాబచ్చన్ కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక కారు


Click it and Unblock the Notifications








