దేశీయ మార్కెట్లోకి శాంగ్ యాంగ్ నుండి రెండవ ఉత్పత్తిగా టివోలి
శాంగ్ యాంగ్ మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి తమ రెండవ ఉత్పత్తి గా టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న శాంగ్ యాంగ్ త్వరలో జరగబోయే ఆటో ఎక్స్ పోలో సంయుక్తంగా వీరి వాహనాన్ని ప్రదర్శించనున్నారు.

శాంగ్ యాంగ్ టివోలి ఫోటోలు:
శాంగ్ యాంగ్ వారి ఈ టివోలి కారును ఇప్పటికే యూరప్ మార్కెట్లో అమ్మకాలను సాగిస్తోంది. ఈ మధ్యనే శాంగ్ యాంగ్ వారు ఈ ఎస్‌యువి కారును భారతీయ రోడ్ల మీద పరీక్షించారు. బారతీయ మార్కెట్లోకి ఈ ఏడాదిలోనే అమ్మకాలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
శాంగ్ యాంగ్ మోటార్స్ సంస్థ మమహీంద్రా అండ్ మహీంద్రా వారి సహకారంతో ఈ టివోలి కారులో 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఈ టివోలిలోని ఇంజన్ ఆప్షనల్ గా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండనుంది.
టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి ఆల్ వీల్ డ్రైవ్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉండనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ టెర్రానొ మరియు రెనొ డస్టర్ వంటి మోడళ్లకు పోటిగా నిలవనుంది.
అయితే శాంగ్‌శాంగ్ వారు దేశీయ మార్కెట్లోకి ఇది వరకే రెక్ట్సాన్ అనే మోడల్‌ను అందించారు. శాంగ్ యాంగ రెక్ట్సాన్ ఫోటోలు:


Click it and Unblock the Notifications































