పొడవైన టివోలి ఎస్‌యువిని విడుదల చేసిన శాంగ్‌యాంగ్ మోటార్స్
శాంగ్‌యాంగ్ మోటార్స్ ఇంగ్లాడులో పొడవైన టివోలి ఎస్‌యువిని విడుదల చేసింది. గత కొంత కాలం నుండి టివోలి ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి శాంగ్‌యాంగ్ సంస్థ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ టివోలి ఎస్‌యువిని శాంగ్‌యాంగ్ ప్రదర్శించింది.

శాంగ్‌యాంగ్ ఈ టివోలి ఎస్‌యువివి ఇంగ్లాడ్‌లో 18,250 పౌండ్ల ఆన్ ధరతో గత మే 2016 లో విడుదల చేసింది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా 16.06 లక్షలు.

ఇది శాంగ్‌యాంగ్ వారి టివోలి రెగ్యులర్ వర్షెన్ యొక్క పొడగించబడిన టివోలిగా అందుబాటులోకి తెచ్చారు.

ఇంగ్లాడులో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ టివోలి ఎస్‌యువిలో 2 వీల్ డ్రైవ్ మ్యాన్యువల్, 2 వీల్ డ్రైవ్ ఆటో, 4 వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ మరియు 4 వీల్ డ్రైవ్ ఆటో వంటి వేరియంట్లో అందుబాటులో ఉంది.

శాంగ్‌యాంగ్ వారి ఈ ఎక్స్‌టెండెడ్ టివోలిలో 1.6-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 113.38బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ప్రస్తుతం ఇంగ్లాడులోని వినియోగదారులకు పెట్రోల్ వేరియంట్ కొత్త టివోలి ఎస్‌యువి అందుబాటులో లేదు. ప్రస్తుతం ఇక్కడ విడుదల చేసిన ఎస్‌యువిని దక్షిణ కొరియాలో టివోలి ఎయిర్ అనే పేరుతో అందుబాటులోకి తెచ్చింది.

దేశీయంగా శాంగ్‌యాంగ్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఆద్వర్యంలో కార్యకలాపాలు సాధిస్తోంది. మహీంద్రా ఈ టివోలి ఎస్‌యువిని ఈ ఏడాదిలోపు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ తమ టివోలి ఎస్‌యువిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరిన్ని ఆటో మొబైల్ వార్తల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

- హిస్టరీలో భారీగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు


Click it and Unblock the Notifications








