సుజుకి సిఇవో పదవికి ఒసాము సుజుకి రాజీనామా: కారణం ఇదే...!
జపాన్/టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్ప్ ఛైర్మెన్ ఒసాము సుజుకి తన ముఖ్య కార్య నిర్వహణాధికారి పదవికి రాజీనామా చేశారు. సుజుకి సంస్థ తమ కార్లకు మైలేజ్ పరీక్షలను అడ్డదారిలో నిర్వహించారనే కారణం చేత ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సుజుకి వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా కూడా ముఖ్య సాంకేతిక అధికారి పదవి నుండి రిటైరయ్యారు. కార్ల మైలేజ్ పరీక్షల్లో ముఖ్య విభాగానికి రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్‌లో ప్రముఖంగా వ్యవహరించాడు.
Also Read: ధర, మైలేజ్, మరియు సేల్స్ పరంగా భారత దేశపు 5 ఉత్తమ పనితీరు గల స్కూటర్లు
ఈ తరుణంలో తరువాత ఎవరు సిఇవో పదవిలో ఉంటారు అని నిర్ణయం తీసుకోవడానికి సంస్థ యొక్క వార్షిక సర్వ సభ్య సమావేశాలలో షేర్ హోల్డర్స్ నిర్ణయం ప్రకారం కొత్త సిఇవో ఎంపిక జరగనుంది. జూన్ 29, 2016 తరువాత ఈ సమావేశాలు జరగనున్నాయి.


Click it and Unblock the Notifications








