2017 ఎస్-క్రాస్ ధరలను వెల్లడించిన మారుతి సుజుకి
మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఎస్‌యువిని క్రాసోవర్ రూపంలో పరిచయం చేసింది. ఎస్-క్రాస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఉన్న దీనిని యూరప్ మార్కెట్లో విడుదల చేసింది. అదే విధంగా యుకె లో పరిచయం చేసిన ఎస్-క్రాస్ ధరలను వివరించింది.

మారుతి సుజుకి యుకె మార్కెట్లో తమ ఎస్-క్రాస్ ను 2017 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. దీని ప్రారంభ వేరియంట్‌ను 14,999 పౌండ్లు (రూ. 12.90 లక్షలు) సుమారగా నిర్ణయించనుంది.

యుకె లో ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఎస్-క్రాస్ 1.4-లీటర్ లేదా 1.4-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.6-లీటర్ డిడిఎస్ఐ డీజల్ ఇంజన్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రారంభ వేరియంట్ ధర ప్రకటించిన ఎస్-క్రాస్ లో 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

ఎస్-క్రాస్ లోని అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్‌గా ఏడు ఎయిర్ బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ వంటివి రానున్నాయి.

ఎస్-క్రాస్ ఇంటీరియర్‌లో బ్లీటూత్ కనెక్టివిటీ, డిఎబి డిజిటల్ రేడియో, ఎయిర్ కండీషనింగ్, పగటి పూట వెలిగే లైట్లు,స 16-అంగుళాల అల్లాయ్ చక్రాలు, స్పీడ్ లిమిట్ గల క్రూయిజ్ కంట్రోల్, బ్లాక్ ప్రొటెక్టివ్ స్కిడ్ ప్లేట్లు, హీటెడ్ డోర్ మిర్రర్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఎస్-క్రాస్ లోని మధ్య వేరియంట్లో ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, శాటిలైట్-న్యావిగేషన్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రివర్ పార్కింగ్ కెమెరా.

ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ ఫాగ్ లైట్లు, సిల్వర్ రూఫ్ రెయిల్, రివర్ ప్రైవసీ గ్లాస్, మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

యుకెలోని టాప్ ఎండ్ వేరియంట్ ఎస్-క్రాస్‌లో రాడార్ బ్రేక్ సపోర్ట్, లెథర్ అప్ హోల్‌స్ట్రే, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, డబుల్ స్లైడింగ్ ప్యానమెరా సన్‌రూఫ్, అల్యూమినియమ్ రూఫ్ రెయిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!
- విపణిలోకి హీరో అచీవర్ 150 విడుదల: ప్రారంభ ధర రూ. 61,800 లు
- ఇండియన్ మార్కెట్ వైపుకు టయోటా నుండి మరో సెడాన్


Click it and Unblock the Notifications








