2016 ప్యారిస్ మోటార్ షో లో సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ప్రదర్శన
మారుతి సుజుకి ఏ ఉత్పత్తిని రూపొందించినా అది మొదటగా ఇండియన్ మార్కెట్లోకి రావాల్సిందే. ఆ తరువాత అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగులేస్తాయి. అదే దారిలోనే మారుతి వారి అప్ కమింగ్ ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ కూడా. 2016 ప్యారిస్ మోటార్ షో లో సందర్శకుల ముందుకు ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ప్రదర్శనకు వచ్చింది.

మారుతి ప్రపంచ కార్ల సెగ్మెంట్లోకి మరే సంస్థ కూడా ఊహించని మరియు నిర్మించలేని ఉత్పత్తిని రూపొందించింది. ఇది ఇండియన్ మార్కెట్‌తో పాటు యూరోపియన్ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలను సాధించనుంది. 2017 నాటికి ప్రపంచ విపణిలోకి అందుబాటులోకి రానుంది.

మారుతి దీనిని డిజైన్ చేసిన అంశంలో అతి ముఖ్యమైన ఫిలాసఫీ కాంపాక్ట్ క్రాసోవర్. బాక్సీ డిజైన్ బాడీతో క్రాసోవర్ స్టైల్‌లో, డ్రైవింగ్‌లో భద్రత పరంగా నమ్మకమైన అనుభూతిని కలిగించే రీతిలో డిజైన్ చేయబడింది.

సాంకేతికంగా ఇగ్నిస్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డ్యూయెల్ జెట్ ఇంజన్‌ను రెండు రకాలుగా అందివ్వనున్నారు. ఈ రెండింటిలో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మరియు లేకుండా ఈ ఇగ్నిస్ అందుబాటులోకి రానుంది.

ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం గల డ్యూయెల్ జెట్ ఇంజన్ సుమారుగా 88బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇందులోని ఇంజన్ ఉత్పత్తి చేయగల పవర్ మరియు టార్క్‌ను చక్రాలకు సరఫరా చేయడానికి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

ఇగ్నిస్‌లోని వేరియంట్‌ను బట్టి పవర్ 2-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్ల పరంగా ఇందులో స్మార్ట్ ఫోన్ అనుసంధానం గల ఆడియో న్యావిగేషన్ సిస్టమ్, ఇందులోనే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు కలవు.

రియర్ వ్యూవ్ కెమెరా, నూతనంగా అభివృద్దిపరచబడిన సస్పెన్షన్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

భద్రత పరంగా ఇందులో సుజుకి తమ సుజుకి టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ (TECT)ని ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే సందర్బాలలో ఇది ఉపయోగపడుతుంది. మరియు ప్రమాదాంలో అత్యధికంగా ధ్వంసమయ్యే మరియు ప్రభావం చేయగల శక్తిని ఎదుర్కునే రీతిలో దీనిని డిజైన్ చేసారు.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ముందు, ప్రక్క మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులను అందించారు. లేన్ డిపార్చర్ వార్నింగ్, వేవింగ్ అలర్ట్ మరియు కారు నిదానంగా కదులుతున్నపుడు వెనుక వైపున ఉన్న వాహనాలను మరియు ప్యాసింజర్‌ల మీద డేగ కన్నేసి ఉంటుంది.

2016 ప్యారిస్ మోటార్ షో లో మారుతి సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్

2016 ప్యారిస్ మోటార్ షో లో మారుతి సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్

2016 ప్యారిస్ మోటార్ షో లో మారుతి సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్

ప్యారిస్ నగరంలో జరిగిన 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన అద్బుతమైన వాహనాల గురించి క్లుణ్ణంగా తెలుగులో...


Click it and Unblock the Notifications








