2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శించిన సుజుకి

By Anil

ప్యారిస్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వాహన ప్రదర్శనలో దేశీయ ఉత్పత్తి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను మారుతి సుజుకి 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. మారుతి తమ మొదటి ఎస్-క్రాస్‌ను నెక్సా షోరూమ్‌ల ద్వారా 2015 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు అదే ఎస్-క్రాస్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2017 నాటికి విడుదల చేయనుంది.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

రెండేళ్ల క్రితం క్రాసోవర్ రూపంలో విడుదలైన ఎస్-క్రాస్ కు వినియోగదారుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇప్పుడు అభివృద్ది చేసిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా వినియోగదారులను ఆకట్టుకోనుంది.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ రూపానికి ఎంతో ముఖ్యమైన ఫ్రంట్ గ్రిల్‌ను పూర్తిగా నిలువు గీతలతో డిజైన్ చేయబడింది. భవిష్యత్తులో మంచి విజయాన్ని అందించే దిశగా దీని డిజైన్ ఉంది.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

కండలు తిరిగిన దీని బాడీ ఆకృతి, నాణ్యమైన పెయింటింగ్, క్రోమ్ పూత పూయబడిన సొబగులు, ఎల్‌ఇడి సమ్మేళన హెడ్ ల్యాంప్స్ డిజైన్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇలా అన్ని ఎక్ట్సీరియర్ అంశాలు దీనిని గ్రాండ్‌గా చూపించాయి.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

ఇంటీరియర్ పరంగా ఇందులో సరికొత్త ఫ్యాబ్రిక్ టచ్ మరియు స్లైడింగ్ ప్యానరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, ముందు మరియు వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు ఇందులోని పగటి పూట వెలిగే లైట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించబడిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ యూరప్ మార్కెట్లో ముందుగా విడుదల కానుంది. ఇందులో 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

ఇందులోని శక్తివంతమైన టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ సుమారుగా 111బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

అదే విధంగా ఇందులో 1.4-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నారు. ఇది సుమారుగా 138బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

డీజల్ వేరియంట్లను కోరుకునే వారి కోసం 1.6-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 118బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2016 ప్యారిస్ మోటార్ షో లో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌

2017 ఏడాదికి చెందిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో దేశీయ మార్కెట్లోకి రానుంది.

.

ప్యారిస్ నగరంలో జరిగిన 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడిన అద్బుతమైన వాహనాల గురించి క్లుణ్ణంగా తెలుగులో...

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2016, 14:07 [IST]
English summary
Read In Telugu: 2016 Paris Motor Show: Suzuki Unveils India-Bound S-Cross Facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+