అంతర్జాతీయంగా అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మారుతి సుజుకి !
జపానీస్ ఆధారిత ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ప్రపంచ వ్యాప్తంగా బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాల పరంగా అధిపత్యం సాధించాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. సుజుకి మోటార్ కార్పోరేషన్ దాదాపుగా 50 లక్షల వరకు ప్రపంచ వ్యాప్తంగా స్విఫ్ట్ కార్ల అమ్మకాలు జరిపింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును 11 సంవత్సరాల ఐదు నెలల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటిని నుండి నేటి వరకు సుమారుగా 50 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి.

ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా 54 శాతం వరకు స్విఫ్ట్ కార్ల అమ్మకాలు జరిగాయి.

ఇండియన్ మార్కెట్లో స్విఫ్ట్ మరియు నాలుగు మీటర్ల పొడవున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కార్లు మొత్తం మీద రెండు లక్షల డెబ్బై వేల వరకు అమ్ముడుపోయాయి.

స్విఫ్ట్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండవ అతి పెద్ద మార్కెట్ యూరప్, ఇక్కడు సుమారుగా 17 శాతం వరకు అమ్మకాలు జరిగాయి.

మూడవ స్థానంలో ఉన్న జపాన్‌లో 10 శాతం వరకు స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి.

మిగతా అంతర్జాతీ మార్కెట్ల నుండి మిగిలిన 19 శాతం స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం సుజుకి స్విఫ్ట్ ను ఏడు దేశాలలో ఉత్పత్తి చేస్తోంది. అవి ఇండియా, జపాన్, హంగేరి, థాయిలాండ్, మలేసియా, చైనా మరియు పాకిస్తాన్ లలో.

స్విఫ్ట్ పది లక్షల అమ్మకాల మార్కుని 2008 జూన్‌లో మరియు 20 లక్షల అమ్మకాల మార్కుని 2011 జనవరిలో మరియు 2013 జనవరి నాటికి 30 లక్షల అమ్మకాలు మార్కుని దాటింది.

సుధీర్ఘ ప్రయాణం తరువాత స్విఫ్ట్ ప్రస్తుతం నాటికి 50 లక్షల అమ్మకాల మైలు రాయిని చేరుకుంది.

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు
గత ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన టాప్-10 కార్లు
గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు


Click it and Unblock the Notifications