బాలెనొ మరియు ఎలైట్ ఐ20 లకు పోటీని సిద్దం చేస్తున్న టాటా మోటార్స్
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ ఫిలాసఫి ఆధారంగా టియాగో హ్యాచ్‌బ్యాక్, కైట్ 5 సెడాన్ మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిలను ప్రదర్శించింది. ఈ అన్ని మోడళ్లు కూడా టాటా వారి అడ్వాన్స్‌డ్ మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా రూపొందించారు.

ఈ వేదికను పావుగా మార్చుకుని రానున్న రెండేళ్లలోపు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది. ఇండియన్ ఆధారిత ఈ తయారీ సంస్థ కొన్ని కొత్త సెగ్మెంట్లలోకి కూడా తమ వాహనాలను అందించనుంది.
టాటా హెక్సా గురించి మీకు తెలియని విషయాలు
దేశీయ మార్కెట్లో ఉన్న ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి టాటా మోటార్స్ ప్రవేశించనుంది. ప్రస్తుతం ఇందులో ఉన్న మారుతి బాలెనొ మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వంటి వాటికి పోటీగా ఉత్పత్తులను తీసుకురానుంది. ఎక్స్451 అనే కోడ్ పేరుతో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది.
శిథిలమైన నానో జీవితం: ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్
ఈ ఎక్స్451 మోడల్‍ను నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి ఆధారంతో రూపొందిస్తున్నారు. అంతే కాకుండా టాటా డిజైన్ ఇంజనీర్లు దీనిని పూర్తిగా స్పోర్టివ్ డిజైన్ మరియు స్పోర్టివ్ ఫ్రంట్ హెడ్ లైట్లతో తయారు చేస్తున్నారు.
ఎన్నేళ్లయినా మారుతి జిప్సీనే మా బెస్ట్ ఎస్‌యువి అంటున్న ఇండియన్ ఆర్మీ..!!
ఎక్ట్సీరియర్‌ను మాత్రమే కాకుండా ఇంటీరియర్ మీద కూడా ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. ఇందులో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరిన్ని తాజా ఆటోమొబైల్ సమాచారాన్ని తెలుగులో పొందడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.



Click it and Unblock the Notifications