బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద టాటా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమిటి
దేశీయ అతి పెద్ద విసృత స్థాయి వాణిజ్య మరియు ప్యాసింజర్ వాహనాలను అందిస్తున్న టాటా మోటార్స్ తమ లైనప్ నుండి ఒక ఉత్పత్తిని తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. గతంలో టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. ఇదే సమయం మిగతా ఉత్పత్తుల మీద అధిక డిమాండ్ ఏర్పడి ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది.

ఈ కారణం చేత టాటా మోటార్స్ ఈ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని ప్రస్తుతానికి నిలిపివేయనున్నట్లు తెలిసింది.

టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లను HORIZONEXT అనే ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ మరియు డెవలప్‌మెంట్ చేయడం జరిగింది.

ఈ ఏడాది టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన టియాగో హ్యాచ్‌బ్యాక్ భారీ అమ్మకాలు మరియు బుకింగ్స్‌ను నమోదు చేసుకుంటోంది.

ఇప్పటికే 40,000 బుకింగ్స్ నమోదు కాగా ప్రతి నెలా సగటున 5,000 టియాగో హ్యాచ్‌బ్యాక్‌లు అమ్ముడుపోతున్నాయి.

ఇప్పటికే 40,000 బుకింగ్స్ నమోదు కాగా ప్రతి నెలా సగటున 5,000 టియాగో హ్యాచ్‌బ్యాక్‌లు అమ్ముడుపోతున్నాయి.

అయితే బోల్ట్‌తో పాటు మంచి ఫలితాలను ఇవ్వలేని ఇతర మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసి కైట్ 5 ను విడుదల చేయనున్నారు అదే విధంగా టియాగో ఉత్పత్తిని పెంచనున్నారు.

టాటా బోల్ట్‌లో 1193సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1248సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లు కలవు.

బోల్ట్‌లోని పెట్రోల్ ఇంజన్ సుమారుగా 89బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

రికార్డులన్నీ బద్దలు: పెరుగుతున్న బుకింగ్‌లు మరియు వెయిటింగ్ పీరియడ్

కొత్త మైలు రాయిని ఛేదించిన మారుతి ఎర్టిగా
కొత్తగా వస్తున్న కియా దెబ్బకు మారుతి చతికిలపడాల్సిందేనా ?


Click it and Unblock the Notifications








