హెక్సా విడుదల, బుకింగ్ మరియు డెలివరీ వివరాలను వెల్లడించిన టాటా

విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా వారి క్రాసోవర్ ఎస్‌యువిని జనవరి 18, 2017 న మార్కెట్లోకి విడుదల చేయనుంది మరియు ఫిబ్రవరి 2017 నుండి వీటిని డెలివరీను ప్రకటిచింది.

By Anil

టాటా నుండి విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ క్రాసోవర్ ఎస్‌యువి హెక్సా మరో నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఇండియన్స్ నుండి హెక్సాకు మంచి స్పందన లభిస్తోంది. దీని గురించి చాలా మంది ఔత్సాహికులు టాటా డీలర్ల వద్ద అనేక అంశాల పరంగా ఆరా తీస్తున్నారు.

టాటా హెక్సా ఎస్‌‌యువి

టాటా మోటార్స్ ఈ హెక్సా క్రాసోవర్ ఎస్‌యువిని వచ్చే జనవరి 18 న దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది. మరియు దీనిని 11,000 రుపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది టాటా.

టాటా హెక్సా ఎస్‌‌యువి

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి ఆరు వేరియంట్లు మరియు తొమ్మిది ట్రిమ్ లలో లభించును. టాటా డీలర్లు ఈ హెక్సా ను ఎంచుకున్న కస్టమర్లకు ఫిబ్రవరి నుండి డెలివరీ ఇవ్వనున్నారు.

టాటా హెక్సా ఎస్‌‌యువి

హెక్సా లోని కొన్ని వేరియంట్లకు వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా ఉన్నప్పటికీ మరికొన్ని వేరియంట్లకు కాలపరిమితి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీని ధరలను పోటీదారులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించనుంది టాటా. ధర మరియు పూర్తి వివరాలతో విడుదలైన తరువాత బుకింగ్స్ ఊపందుకునే అవకాశం ఉంది.

టాటా హెక్సా ఎస్‌‌యువి

కస్టమర్లు టాటా హెక్సా ను 6 మరియు 7-సీటింగ్ సామర్థ్యం ఉండే విధంగా ఎంచుకునే అవకాశం ఉంది. రెండు విధాలుగా పవర్ ఉత్పత్తి చేసే 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్ కలదు.

టాటా హెక్సా ఎస్‌‌యువి

వారికోర్300 ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 5 లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానుంది.

టాటా హెక్సా ఎస్‌‌యువి

వారికోర్400 ఇంజన్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్ అనుసంధానంతో రానుంది.

టాటా హెక్సా ఎస్‌‌యువి

సరికొత్త హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి, ఆటో, డైనమిక్, కంఫర్ట్ మరియు రఫ్ రోడ్. హెక్సా ఎస్‌యువిని 13.50 నుండి 18.5 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా హెక్సా ఎస్‌‌యువి

టాటా మోటార్స్ ఈ హెక్సా క్రాసోవర్ ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు రెనో లాంజి వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

టాటా హెక్సా ఎస్‌‌యువి
  • వితారా బ్రిజా రికార్డ్ సేల్స్
  • టియాగో లో మరో వేరియంట్ ను పరిచయం చేస్తున్న టాటా

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2016, 19:08 [IST]
English summary
Tata Hexa Deliveries To Commence From February 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+