టాటా నుండి అద్బుతమైన మోడల్ విడుదలకు ముహూర్తం ఖరారు
టాటా మోటార్స్ తమ సరికొత్త ప్రీమియమ్ ఎమ్‌పివి హెక్సా ను వచ్చే ఏడాది జనవరి 18 నాటికి విడుదల చేయడానికి సిద్దమయ్యింది.
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త ప్రీమియమ్ క్రాసోవర్ ఎమ్‌పివి విడుదలకు దాదాపుగా సిద్దమైంది. టాటా మోటార్స్ డీలర్ల వద్ద వీటి సంభందించిన బుకింగ్స్ ప్రారంభించిన నేపథ్యంలో అధిక డిమాండ్ పొందుతున్న తరుణంలో ఈ హెక్సా విడుదలను మరింత తొందర చేసినట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ వాహనాల డీలర్ల వద్ద ఇప్పటికే ఈ హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివికి సంభందించి బుకింగ్స్ ప్రారంభించగా, కస్టమర్ల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడంతో దీని విడుదలకు వడివడిగా సిద్దమవుతోంది.

టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎమ్‌పివి ఎమ్‌పివి వాహనాన్ని ఆరు విభిన్న వేరియంట్లలో విడుదల చేస్తోంది మరియు వినియోగదారులు ఈ హెక్సాను రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ అనే ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

సాంకేతికంగా టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎమ్‌పివి వాహనంలో 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది రెండు రకాల పవర్‌ను ఉత్పత్తి చేయునట్లు ట్యూనింగ్ చేయబడింది.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల వేరియంట్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా మోటార్స్ హెక్సా వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి మరియు రెనో లాజీ స్టెప్‌వే వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

డిజైన్, ఇంజన్, పనితీరుతో పాటు నూతన ఫీచర్లతో రానున్న ఈ హెక్సా ఎమ్‌పివిఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 18 లక్షలతో ఎక్స్ షోరూమ్ గా విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో నిరంతరం ఆటోమొబైల్ వార్తలను పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగు (DriveSpark Telugu)తో కలసి ఉండండి.

- మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్
- ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు
- పెద్ద SUVని విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి


Click it and Unblock the Notifications








