టాటా మెటార్స్ నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న హెక్సా బుకింగ్స్ ప్రారంభం
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ హెక్సా ఎమ్‌పివిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. నవంబర్ నుండి దేశవ్యాప్తంగా హెక్సా ఎమ్‌పివికి చెందిన బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. మరియు వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

మీడియా ప్రమోషన్ల కోసం అక్టోబర్ చివరి హెక్సాకు చెందిన పూర్తి వివరాలను టాటా మోటార్స్ వెల్లడించనుందని. టాటా మోటార్స్ హెడ్ మాయంక్ పరీక్ తెలిపాడు.

అయితే వచ్చే నవంబర్‌లోనే విడుదల కావాల్సిన టాటా హెక్సా వచ్చే ఏడాదిలో విడుదల కానుండటం ప్రశ్నించగా, విడుదలను ఆలస్యం చేయడానికి ఏవిదమైన కారణాలు లేవని తెలిపాడు.

సాంకేతికంగా హెక్సాలో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న వారికోర్ 400 డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 153.87బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హెక్సా ఎమ్‌పివి ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవా క్రిస్టా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 వంటి మోడళ్లకు పోటీగా ఉండనుంది.

ఇన్నోవా క్రిస్టా కన్నా తక్కువప ధరతో పక్కా ప్రణాళికతో హెక్సాను 13 లేదా 14 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

- పెద్ద వేట: చైనా మార్కెట్ వైపు అడుగులేస్తున్న మహీంద్రా
- రెనో క్విడ్ లో లోపం, 50,000 కార్లు వెనక్కి: మీ కారు సేఫ్‌గా ఉందా ?
- సంచలనాత్మక విజయంలో టాటా టియాగో: భారీ బుకింగ్స్ కారణంగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్


Click it and Unblock the Notifications








